₹ 350
మన జీవితమంతా కలలు కంటూ కూర్చోవడామేనని, తీయని కలలన్ని యవ్వనంలోనే కంటమని , అంచేత జీవితంలోని మాధుర్యం అంతా యోవనంలోనే వుందని ఎవరైనా అంటే వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను; కానీ ఈ కలలేవి యధార్ధాలు కావు. పాతకాలాల్ని స్మరించుకుంటూ బ్రతకాల్సిందే అని అంటే మాత్రం నేను ఖాండిస్తాను. కల యధార్ధమవుతుందని నేను రుజువు చేసుకున్నాను. నిదర్శనం యిస్తాను.
నా యువక స్వప్నాలకు ఆద్యంతాలు ఆశప్రియ. ఆమె నా ఊహ విశ్వానికి కేంద్రం; హృదయానికి నాలుగో పరిమాణం; నా పునికి కారకురాలు ; నిద్రకు కన్నీటితో తడిసిన తలగడదిండు, వొక్క కన్నీటి బిందువును, శాస్త్రజ్ఞుడు పరిశోధిస్తే అందులో ఆశప్రియ అణువులు దొరుకుతాయి; ఆ పరమాణువుల వింతకాలయిక నా స్వప్నం.
- Title :Bucchibabu kathalu Vol- 1
- Author :Buchi Babu
- Publisher :Nachethana Publishing House
- ISBN :MANIMN1206
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :398
- Language :Telugu
- Availability :instock