• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Buddha bhoomi Kathalu

Buddha bhoomi Kathalu By D Nataraj

₹ 100

              అనగా అనగా అంధకసాగరం అనే ఒక మురికి గుంటలో "బురదరాజు" అనే ఒక తెల్లపంది వుండేది.

           ఆ మురికి గుంటలోకి బురదరాజు ఎవరినీ రానిచ్చేది కాదు. ఆ మురికి గుంటలో సేదదీరుదామని చుట్టుప్రక్కలి పందులు ఎంతో అశతోవచ్చిన యీపంది వాటిని ఆ మురికి గుంటలోకి రానిచ్చేదికాదు. పైగా 'నువ్వు తక్కువజాతి నల్లమచ్చలు పందివి, యీ బురద గుంటలోకి అడుగు పెట్టడానికి కూడా నీకు అర్హత లేదు' అంటూనో, 'మీ తాతల నాటి పందులు పరమ దరిద్రగొట్టు పందులు, మా తాతలకి వ్యతిరేకంగా యుద్ధం చేసిన నీచాతినీచులు, వారి రక్తం పంచుకుపుట్టిన నిన్ను యీ మురికి గుంటలోకి రానిస్తే బ్రహ్మ జ్ఞానం పొందిన నాకు పరువు తక్కువ' అంటూనో, 'నీకు లోక జ్ఞానం తక్కువ, మా వరాహరాజుల చరిత్ర బాగా తెలుసుకుని రా, అప్పుడు ఆలోచిస్తాను' అని అంటూనో పందుల్ని చిన్నపుచ్చుతూ, అసహ్యించుకుంటూ, ద్వేషిస్తూ, ఏ పందినీ తన మురికి గుంట దరిదాపుల్లోకి రానియ్యకుండా, ఆ మురికి గుంటలో తానే ఏకైక రాజుగా బ్రతుకుతూ వుండేది. ఏదైనా పంది తన కోరికలు తీర్చేటటువంటిది, తన బురద గుంట వైపుకు వస్తే ఎంతో ప్రేమ వున్నట్లుగా దాని బురద గుంటలోకి పిలిచి దానితో తన అవసరాలు తీర్చుకొని, దానిని ఏదో నెపం మీద బైటికి గెంటేసేది. 

                                                                                                              - డి. నటరాజ్   

  • Title :Buddha bhoomi Kathalu
  • Author :D Nataraj
  • Publisher :Pallavi Publications
  • ISBN :PALLAVI053
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :112
  • Language :Telugu
  • Availability :instock