శోభన రాత్రి మధురానుభూతులను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఎన్నాళ్ళగానో కలలుగన్న మన్మధ సామ్రాజ్యం లోనికి కాలు పెట్టడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడతను.
కానీ ఆ సమయంలో వచ్చిన ఒక ఫోన్కాల్ అతని జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుందని ఊహించలేకపోయాడు.
ఒక అరగంట క్రితం -
అతనికి క్షణమొక ఘడియ లాగ తోస్తోంది. తొలిరేయి శోభనం గది లోనికి అడుగు పెట్టాల్సిన ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ ఒంటి నిండా తమకంతో నిలవలేకపోతున్నాడు. స్వర్గలోకపుటంచులు చవి చూసే ఆ అద్భుత క్షణాల కోసం ప్రతి నిమిషం ఒక యుగంలా గడుపుతూ ఎదురుచూస్తున్నాడు. ఊహల్లో తను రమించిన అనుభూతులను ఇప్పుడు వాస్తవం చేసుకోబోయే మధుర క్షణాలను చవి చూసేందుకు తహతహలాడుతున్నాడు.
అందంగా తయారై అప్సరసలా మెరిసిపోతున్న ఆమె... తన దేవేరి... తన వయ్యారి... తన వగలరాణి... తన హృదయేశ్వరి... తన ఆరో ప్రాణం... శోభనం. గదిలో తన రాక కోసం ఎదురుచూస్తోంది.
అద్భుతమైన అలంకరణలో అతిలోక సుందరిలా మెరిసిపోతున్న ఆమె లేతాకుపచ్చ రంగు పట్టు చీర, జలతారు రవికె, తల నిండా ఘుమఘుమలాడే జాజిమల్లెలు, చేతులకు గాజులు, కాలికి వెండి పట్టీలు, చెవులకు జుంకాలు, నుదుట కళ్యాణ తిలకం, బుగ్గన చుక్కతో రతిదేవికి పోటీ ఇచ్చేంత అందాన్ని ప్రోది చేసుకుని తనకు సంపూర్ణంగా అర్పించుకోడానికి సిద్ధంగా ఉంది................