1 వ అధ్యాయం
ముసలి నౌకరు లోపలికి తొంగి చూసాడు. గుడ్లు తేలేసి నీళ్లల్లో మునిగానాం, తేలానాం అన్నట్లు ఉన్న యజమానిని చూసి ఒక్క క్షణం గాబరా పడ్డాడు. అంతలోనే తేరుకొని “ఇదెప్పుడూ ఉండేదేగా, ఇదో రకమైన యోగా సాధన' అనుకున్నాడు. దగ్గరకు వెళ్ళే సాహసం చెయ్యలేదు. కానీ, 'తెల్లారగట్ట ఐదింటికి కల్లా లేవాలి. పొద్దు పొడవక ముందే మన ప్రయాణం' అని రాత్రి యజమాని చెప్పిన మాటలు గుర్తుకొచ్చి 'అయ్యా, లేదురూ' అని చిన్నగా గొణిగాడు. నీళ్ళ తోట్లో స్నానం చేస్తున్న జనరల్ కళ్ళు మగతగా విప్పి ఎదురుగా ఉన్న ముసలి నౌకరు 'జోస్' కేసి చూసాడు. రెండు చేతుల్తో నీళ్ళ తొట్టి రెండంచులను ఒడిపి పట్టుకోడానికి ప్రయత్నించాడు. ఒక పట్టాన వశం కాలేదు. అంతలోనే ఒక్క ఊపులో నీళ్ళలోంచి పైకి ఎగిసిన డాల్ఫిన్ చేపలా పైకి లేచి నిలబడ్డాడు. అంత ఒక్క ప్రాణంలో ఇంత బలం ఎక్కడిదో?
పదా పోదాం ఎంత గమ్మున బయల్దేరితే అంత మంచిది. ఇక్కడ మనమంటే ఎవరికన్నా అభిమానమా పాడా' అన్నాడు జనరల్. జోస్ చేతిలో ఉన్న కప్పు సాసరు | అందుకున్నాడు. 'పాపీ' తయారు చేసిన జిగురు లాం ఔషధ ద్రావకం మొత్తాన్ని ఐదంటే ఐదే గుక్కల్లో తాగేసాడు. నాలుక చురుక్కు మనిపించేంత వేడిగా ఉన్న ఆ ద్రావకం తాగాక జనరల్ ఒంట్లో అమృతం తాగినంత మార్పులు గమనించాడు 'జోస్'.
బయట ప్రయాణానికి గుర్రపు బగ్రీలు సిద్ధంగా ఉన్నాయి. అధికారగణం | ఒక్కరొక్కరుగా కూడుకుంటున్నారు. ఐనా 'జోస్'కి ఇవాళ ప్రయాణం ఉంటుందని నమ్మకం విదరా. ఇలా జనరల్ 'పదా పోదాం ' అని ఏ నూటొక్కసార్లు అని ఉంటాడు గతంలో, కానీ అడుగు కదిపితేగా!
జనరల్ ఒంటి తడి అద్దుకుని ఎప్పుడో పెరూలో ఉండగా తొడుక్కున్న బట్టల జత అనుకున్నాడు మళ్ళీ తన ఒంట్లో ఎంత మార్పు వచ్చిందో తనకి తెలుస్తానే ఉంది. ఉళ్ళంతా పాలిపోయింది. ఎండకి ఎండి, వానకి తడిచీ మొహమూ చేతులూ సబారిపోయాయి. మొన్న జూలై నాటికి నలభై ఆరేళ్ళు వచ్చాయి. అప్పటికే తన............