తెలుగు కవితామార్గాన్ని నిర్దేశించిన 'వైతాళికులు'
ఇంటింటికీ ఒక రచయిత ఉన్న కాలమిది. ఇంతమంది రచయిత లుండడం హర్షించదగిన పరిణామమే. ఎందుకంటే రచయిత షెల్లీ అన్నట్లు 'కవులు ప్రపంచంలో నీతిని ప్రచ్ఛన్నంగా తీర్చిదిద్దే శాసనాధికారులు! తెలుగు సాహిత్యంలో 1935లో ఒక పుస్తకం అచ్చయింది. ఇప్పటికది పది ముద్రణలు పొందింది. వేలమందిని చేరుకుంది. తెలుగు సాహిత్యం తొలి 'వెలుగు'ను అది తరాలకు అందించే మణిదీపమైంది. కవితో, కథో రాయాలనే ప్రతిఒక్కరూ చదవదగిన పుస్తకమది. అదే 'వైతాళికులు'.
ఇరవయ్యో శతాబ్దం తొలినాళ్లలో ప్రపంచమంతా అతలాకుతలమైన తరుణమది. ఆర్థికంగా, రాజకీయంగా, నైతికంగా, సామాజికంగా 'వ్యుత్పన్నతా పరంగా' తీవ్రమైన మార్పులు ప్రపంచమంతటా చోటు చేసుకుంటున్న తరుణంలో ఆ సామాజిక చిత్రాన్ని పదిలంగా ఒడిసి పట్టుకొని ఒక సాహితీ సుగతుడు అందించిన అపూర్వ కావ్యమది. పురాణ యుగంలో మత, ధర్మ ప్రచారాలు మిన్నుముట్టాయి. ప్రబంధ యుగంలో శృంగారం ప్రధానమై ప్రజలను రసవాహినిలో ముంచింది. తంజావూరు నాయకుల కాలంలో సాహిత్యం వాణిజ్యవస్తువుగా మారింది. వాణివి రాణి అంటూ అంధయుగాన్ని సృష్టించారు. పందొమ్మిదో శతాబ్దంలో సాహిత్యానికి 'నవయుగం' ప్రారంభమైంది. భావ సంచలనం........................