• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Chaina Japan Prasiddha Kathalu

Chaina Japan Prasiddha Kathalu By Surabattula Subramanyam

₹ 150

అహింసావాది, తోడేలు

సియే లియాంగ్
 

ఛావోజమీ ప్రభువు డేగలతో, వేటకుక్కలతో, ఈటెలు, బాణాలు గల వేటగాళ్ళతో, ఇంకా పరివారంతో అట్టహాసంగా వేటకు బయలుదేరాడు. దారిలో కొంచెం దూరాన బాట కడ్డంగా ఒక తోడేలు నిలబడి ఉండడం జమీందారు చూశాడు. ఆ తోడేలు వెనుక కాళ్ళమీద నిలబడి అరుస్తూఉంది. గురిచూసి కొట్టడానికి మహావీలుగా ఉంది. ఒక్క బాణముతో జమీందారు దాన్ని గాయపరచాడు. అది తప్పుకొని పరుగెత్తడంతో వేటగాళ్ళు వెంటబడ్డారు. వేటగాళ్ళ అరుపులు, కుక్కల మొరుగులతో అడివి ప్రతిధ్వనించింది; దుమారం లేచింది. దాంట్లో కనబడకుండా పారిపోడానికి తోడేలుకు వీలయింది.

అదే సమయానికి టంగుకువా తన గాడిద నెక్కి చంగ్ షన్ కొండల మీదకు పోతున్నాడు. అతని సంచిలో కొన్ని గుడ్డలు కొన్ని పుస్తకాలు మాత్రమున్నాయి. అతనిది మోట్సు మతం. ఆ మతస్థులకు స్వార్ధరహిత జీవితం, పరసేవ ముఖ్యం. రాజులు, జమీందారులు, సామాన్య ప్రజలు, అందరికీ విశ్వప్రేమ నేర్పాలని వారి దీక్ష. వారు తమ జీవితాలు పేదరికానికంకితం చేశారు. ఇతరులకు సాయపడటంలో తమకాపద గల్గినా లెక్కచేయరు.

టంగుకువా ఈ సవ్వడి విన్నాడు. ఇంతలో తోడేలు వేటగాళ్ళ బారినుండి తప్పించుకొని తనవైపే వస్తుంది. అతణ్ని చూచి తనకు సాయంచేయమని దీనంగా అరిచింది. దాని వీపున గుచ్చుకొని ఉన్న బాణం కంటబడగానే అతని మనస్సు కరిగిపోయింది.................

  • Title :Chaina Japan Prasiddha Kathalu
  • Author :Surabattula Subramanyam
  • Publisher :Bhodhi Foundation
  • ISBN :MANIMN4366
  • Binding :papar back
  • Published Date :2023
  • Number Of Pages :108
  • Language :Telugu
  • Availability :instock