చైతన్య మహిళా సంఘం గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మహిళలను సంఘటిత పరచడంలో ఒక ముఖ్యమైన, గణనీయమైన పాత్రను పోషిస్తూ వస్తున్నది. శ్రామిక, మధ్యతరగతి మహిళలను భూమికగా చేసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాదు, విశాఖపట్నంతో సహా మరెన్నో పట్టణాలలో పనిచేస్తూ వస్తున్నది. పీడిత మహిళల హక్కుల కోసం మిలిటెంటుగా పోరాడే క్రమంలో తీవ్ర రాజ్య నిర్బంధాన్ని కూడా ఎదుర్కొంటున్నది. రాజ్యహింసలో కొంతమంది. కామ్రేడు కోల్పోయింది. మహిళల హక్కుల కోసం పోరాడటం తన ప్రధాన కార్యక్షేత్రంగా ఉంటూనే, అన్ని ఇతర ప్రజాస్వామిక ఉద్యమాలకూ, మౌలిక హక్కుల కోసం జరిగే పోరాటాలకూ మద్దతుగా సౌహార్ద ఉద్యమాలు నిర్మిస్తోంది.
మహిళామార్గం' పత్రిక, ప్రచురణల ద్వారా ఉత్తేజకరమైన తన సాంస్కృతిక బృందం ద్వారా మహిళా విముక్తి భావజాలాన్ని ప్రచారం చేస్తున్నది. అంతేకాక వర్గ, కుల, పితృస్వామ్య వ్యతిరేక పోరాటాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని చెప్పూ సిఎంఎస్ అఖిల భారత మహిళా ఉద్యమానికి కూడా ప్రేరణ నిచ్చి, ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో తన ఇరవై యేళ్ళ చరిత్రని పుస్తక రూపంలో నమోదు చేయడం ఆహ్వానించదగ్గ విషయం.
-షోమా సేన్