ఫాదర్ పి. జోజయ్య గారు 1931లో గుంటూరు జిల్లా కనపర్రు గ్రామంలో జన్మించారు. పాఠశాల విద్యను కనపర్రు, ఫిరంగిపురాలలో, కళాశాల విద్యను మద్రాసు లొయోలా కళాశాలలో పూర్తి చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. పట్టాను పుచ్చుకున్నారు. 1955లో జెస్విట్ సొసైటీ (ఏసుసభ)లో చేరారు. విజయవాడలోని ఆంధ్ర లొయోలా కాలేజిలో అధ్యాపకుడిగా పనిచేశారు.
బైబుల్లోని పూర్వ వేదాన్ని తెలుగులోకి అనువదించారు. చాల యేండ్ల పాటు విద్యార్థులకు నాయకత్వపు క్యాంపులు నిర్వహించారు. వాళ్ల కొరకే చైతన్యవాణి పత్రికను 1974 జనవరి నుండి నడిపించారు. ఆ పత్రికలో ప్రచురించిన వ్యాసాలే ఈ విద్యాహిత గ్రంథమాల నాల్గు సంపుటాలు.