• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Chalam Maharshee!

Chalam Maharshee! By Sri Sri

₹ 40

                         తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన దానికి మా అందరి ఆరాధనలు పొందిన రచయిత అందుకే నాకు ఆయన ఆరాధ్యుడు' అంటారు శ్రీశ్రీ. ఆ చలం గురించి శ్రీశ్రీ ఆలోచనల, అభిప్రాయాల,విశేషాల, విశ్లేషణల సమాహారం ఈ పుస్తకం.శ్రీశ్రీ సంబోధించే 'చలం మహరీ!! అనే పిలుపే ఈ పుస్తకానికి శీర్షికగా ఉంచాం. అందరినీ అలరిస్తుందని నమ్ముతూ ముందుగా...

                        'లండన్ నగరంలో వెలువడుతున్న విదేశాంధ్ర ప్రచురణల'నిమిత్తం నా 'మహా ప్రస్థానం' గీతాలను టేప్ రికారు చేసి, నా కంఠధ్వని ఉన్న Cassetesతో బాటు, నా సొంత దస్తూరీలో అన్ని గీతాలనూ facsimile రూపంలో విడుదల చేసే సందర్భంలో ముందుమాటగా ఏదైనా చెప్పమని ప్రచురణకర్త హోదాలో మిత్రుడు డా॥ జి.కృష్ణమూర్తి నన్నడిగారు. అప్పుడు చలంగారి యోగ్యతాపత్రాన్నే చదివేదామనుకున్నాను. “మీ అభిప్రాయాలే వినిపించాలన్నారు మిత్రులు. 'సరే!' అన్నాన్నేను.

                         ఈ ప్రచురణలో చలంగారి రచన లేకపోవడం ఒక లోపమని నేను భావించలేదు. ఎక్కడైనా దాని విశిష్టమైనవిలువ దానికుండనే వుంది. అయితే అదే ముఖ్యమైనదని అనుకునేవాళ్లు కూడా ఉన్నారు'.

                          ( -శ్రీశ్రీ-నామాట, 'మహాప్రస్థానం' విదేశాంధ్ర ప్రచురణలు, లండన్ 1981). శ్రీశ్రీ చెప్పినా సరే ఇది కచ్చితంగా లోపమేనని, నమ్ముతోంది శ్రీశ్రీ సాహిత్యనిధి. సకల సంఖ్యాక చలం అభిమానులే కాదు, అసంఖ్యాక శ్రీశ్రీ అభిమానుల అభిప్రాయం కూడా ఇదే.

                          శ్రీశ్రీ చెప్పినప్పటికీ లండన్ 'మహాప్రస్థానం' ముద్రణ అనంతరం 40ఏళ్ల కాలంలో మహాప్రస్థానం'నుంచి యోగ్యతాపత్రాన్ని ఎవరూ, ఎప్పుడూ, ఎక్కడా విడదీయలేదు,విడదీసి ప్రచురించలేదు, లండన్ 'మహాప్రస్థానం' ఇండియన్ 'మహాప్రస్థానం'గా అచ్చవడంతో పాటు.

                          ఇందులో శ్రీశ్రీ యోగ్యతాపత్రం లేకపోవడానికి శ్రీశ్రీ చెప్పిన తగిన సాంకేతిక కారణం కాదనలేక పోయినదయినా, 'ఈ ప్రచురణలో చలంగారి రచన లేకపోవడం ఒక లోపమని నేను భావించలేదు.' అని శ్రీశ్రీ అనడం మాత్రం న్యాయం కాదని ఖండిస్తున్నాం.

                           'ఆధునిక సాహిత్య విమర్శకొక మేగ్నాకార్టాలాంటి ఆ(ముందుమాట)వ్యాసం నిజంగా నాకో యోగ్యతాపత్రమనే భావిస్తున్నాను' అన్న శ్రీశ్రీ మాట అక్షరసత్యం. చలం పదండి ముందుమాట ప్రత్యక్షరం సాక్ష్యం.ఇది శ్రీశ్రీ సాహిత్యం , శ్రీశ్రీపై సాహిత్యం రెండోనూరు పుస్తకాల హోరుప్రణాళికలో శ్రీశ్రీ సాహిత్యనిధి అందిస్తున్న 106వ పుస్తకం. శ్రీశ్రీ సాహిత్య ఉద్యమయాత్రలోకి కదలిరండి,నిరం నుంచిన్నీ కలుపుకురండి. మీవంతూ గొంతూ అందించండి. 

                                                                                                                                                                                                                                             కన్వీనర్, శ్రీశ్రీ సాహిత్యనిధి.

  • Title :Chalam Maharshee!
  • Author :Sri Sri
  • Publisher :Sri Sri Sahityanidhi Publications
  • ISBN :MANIMN2684
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :39
  • Language :Telugu
  • Availability :instock