₹ 400
చలంగారి 85 ఎల్లయణంలో చివరి ముపై సంవత్సరాలు , భగవాన్ రమణ మహర్షి ఆశ్రమం ఉన్న, తిరువణ్ణామలైలో గడిచాయి. ఆంధ్రదేశంలోని ఉండి నలభై ఏళ్లపాటు సంప్రదాయ విరుద్ధంగా తాను నమ్మిన విలువ కోసం అవిశ్రాంత సమరం సాగించిన చలంగారి చివరిదశలో ఆశ్రమవాసం ఎందుకు ఎన్నుకున్నట్లు? అప్పటి దాక తాను చేసిన రచన వ్యాసంగానికి పశ్చాతాపం చెందాడని, తన రాచలనన్నిటిని తగలబెట్టమన్నాడని అప్పట్లో విరోధులు పెద్ద ఎత్తునే ప్రచారం చేసారు.
అశేషమయిన అయన పాఠకలోకంలో ఆమాట నమ్మినవారు కూడా చాలామందే ఉన్నారు. తర్వాత కొంత కాలానికి విజయవాడ ఆకాశవాణి తరపున బాలాంత్రపు రాజనీకాంతరావు స్వయంగా రమణాశ్రమం చేరుకొని ఆయనతో జరిపిన గోష్ఠిని రికార్డు చేసుకొనివచ్చి మళ్లీ మళ్లి ప్రసారం చేస్తేగాని ఈ దుమారం తగ్గలేదు.
- Title :Chalam Sahitya Sangraham
- Author :C Dharmarao , Vavilala Subbarao
- Publisher :Challam Foundations
- ISBN :MANIMN0799
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :504
- Language :Telugu
- Availability :outofstock