మూవీ : సిల్సిలా (1981)
యే కహాఁ ఆగయే హం....
నేను నా ఏకాంతం - తరచూ ఇరువురం ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం- నువ్వు ఉంటే ఇలా ఉండేది అలా ఉండేది,
నువ్వు ఏదో ఒకటి చెప్తూ ఉండే దానివి కదా! నువ్వు ఏ విషయాల పట్ల ఆందోళన పడే దానివో, ఏ విషయాల పట్ల నువ్వు ఎంతగానవ్వే దానివో...
ఇలా ఏవేవో ఆలోచనలు నాలో...
ఆమె ఆలాపన: కలిసి నడుస్తూ మనం ఎక్కడ దాకా వచ్చాము ? నీ బాహువుల్లో నా శరీరం, ప్రాణం కరిగిపోయేదకా....
అతడు : ఇది నల్లని చీకటిరాత్రా లేక నీవు కురులు విప్పుకోవడమా !
అది వెన్నెలా లేక నీ చూపులతో చీకటిరాత్రిని కడిగేస్తున్నావా ?
అవి నింగిలోని చుక్కలా, గాలికి ఎగిరే నీ పైటకొంగా అలా కనబడేది ?
ఎంత మత్తుగా, చల్లగా హాయిగా ఉంది ఈ గుబాళింపు నీ శరీరాని కాదు కదా! ఈ పరిమళం ?
ఇది చెట్ల ఆకులు చేస్తున్న గల గల ధ్వనా లేక నీవు గుసగుసలాడుతున్న చప్పుడా?...
ఇలా నేను ఎప్పటినుంచో నిశ్శబ్దంగా ఆలోచిస్తూ ఉంటాను. అయినా నాకు తెలుసు నీవీ పరిసరాల్లో లేవని ... ఎక్కడా లేవని,
కానీ నా హృదయం మాత్రం చెబుతోంది నువ్విక్కడే, ఎక్కడో తప్పక..........................