వరప్రదానం
విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టు పై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడపసాగాడు. అప్పుడు శవం లోని బేతాళుడు, " రాజా, నీవు ప్రదర్శించే • ఈ శ్రమతోనూ, దీక్షతోనూ ఎన్నో అద్భుత శక్తులు సంపాదించి, దేవదత్తుడి లాగా లోకో పకారం చేయవచ్చును గదా. ఎందు కిలా నీ శ్రమనూ, దీక్షనూ వ్యర్థం చేసుకుంటు న్నావు? నీ కా దేవదత్తుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను," అంటూ ఇలా చెప్పసాగాడు.
ఒక ఊళ్ళో దేవదత్తుడనే ఒక శ్రీమంతు దుండే వాడు. దేహీ అని అడిగిన వాడి కెల్లా దానధర్మాలు చెయ్యటం ఆయనకు బాగా అలవాటై పోయింది. పేదసాదల మాట అటుంచి, జరుగుబాటు కలిగిన వాళ్ళు కూడా దేవదత్తుడి వద్ద దానాలు పట్టే వాళ్ళు, ప్రతి రోజూ దానధర్మాలు ఎంత...............