వింత ఎముక
పూర్వం సువర్ణదేశాన్ని సుచంద్రు డనే రాజు పాలించేవాడు. ఆయన యాభై ఏళ్ళుగా రాజ్యం చేసి, పరిసర దేశాలెన్నిటినో జయించి తన రాజ్యంలో కలుపుకున్నా, ఆయన కింకా రాజ్యదాహం తీరనేలేదు.
ఒక రోజు రాజు వేటకు బయలుదేరాడు. తన దేశానికి ఉత్తరపు సరిహద్దున ఉన్న కొండలలో వేటాడుతూ ఆయన ఒక లేడి వెంట అనేక మైళ్ళు పరిగెత్తాడు. చివరకు లేడి ఎటో అదృశ్యమయింది. గుర్రం అలిసి పోయింది. రాజూ అలిసిపోయాడు. మిట్ట మధ్యాహ్నమయింది. రాజు ఒక చెట్టు కింద నిలబడి, లేడి మాయమైపోయిన దిక్కుగా చూశాడు.
రాజు కంటపడిన ప్రకృతి దృశ్యాలు ఆయనను ఆశ్చర్యపరిచాయి. ఇంకా ఉత్తరంగా దూరాన ఎత్తయిన పర్వతా లున్నాయి. తాను నిలబడిన చోటికి ఆ పర్వ.................