బెస్తవాడి కోరిక
గౌరీపురం అనే గ్రామానికి సమీపానగల, ఒక నీటివాగు వద్ద, లక్ష్మణుడనే బెస్త వాడు, ఒక పూరిపాక వేసుకుని, అందులో భార్యాబిడ్డలతోచాలా కాలంగా నివసిస్తూండే వాడు. వాడున్నచోట వాగు బాగా లోతుగా వుండి, నీటివేగం తక్కువగా వుండేది. ఆ కారణంవల్ల, వాడి వలలో చేపలు బాగా పడుతూండేవి. లక్ష్మణుడు వాటిని దగ్గర్లో వున్న పట్టణంలో అమ్మి, వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని హాయిగా పోషిస్తూ ఉండేవాడు.
ఒక రోజున ఇద్దరు రాజభటులు, బెస్తవాడి దగ్గరకు వచ్చి, "మహారాజు చంద్రసేనుడు ప్రజల బాగోగులు తెలుసు కునేందుకు దేశపర్యటన చేస్తూ, త్వరలో ఇక్కడికి రానున్నారు. వారు విడిది చేసేందుకు, ఈ ప్రదేశం చెట్టూ చేమలతో, ఎడతెగక పారే నీటివాగుతో అనువుగా..........