నగరంలో ఉద్యోగం
--------------- మాచిరాజు కామేశ్వరరావు
చలపతీ, శేషాద్రీ చదువులు పూర్తిచేసి నగరంలో ఉద్యోగం చెయ్యాలన్న మోజులో ఉన్నారు. నగర పాలక సంస్థలో ఖాళీలు ఉన్నట్టు తెలిసి, ఇద్దరూ దరఖాస్తులు పంపుకున్నారు. ఫలానా రోజున ఉద్యోగుల ఎన్నిక జరుగుతుందని ఇద్దరికీ కబురు అందింది.
చలపతి తండ్రికి ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడికి కావలసిన మనిషి మురహరి అనే ఆయన నగరంలో వుంటున్నాడు. అందుచేత తండ్రి చలపతితో సత్రంలో దిగవద్దని మురహరి ఇంటికి వెళ్ళమని చెప్పి తన స్నేహితుడిచేత మురహరికి ఒక లేఖ రాయించి చలపతికి ఇచ్చాడు.
చలపతి మురహరి ఇంటికి వెళ్లటానికి నిశ్చయించుకున్నాడు. కాని శేషాద్రి ముక్కు, ముఖమూ తెలియనివారింట దిగటం ఏమాత్రం ఇష్టంలేక సత్రంలో దిగుతానన్నాడు. వాళ్ళ ప్రయాణం అనుకున్నంత చురుకుగా జరగక ఉద్యోగస్తుల ఎన్నికకు ముందురోజు సాయంత్రం నగరం చేరవలసిన వాళ్ళు మర్నాడు చివరిజాములో అక్కడికి చేరారు. తెల్లవారితే ఉద్యోగులు ఎన్నిక............................