• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Chandamamanu Entha Kalam Bandee Cheyagalaru? ?

Chandamamanu Entha Kalam Bandee Cheyagalaru? ? By Suchitra Vijayan

₹ 230

అక్షరాలు కుట్రలు చేయగలవా?

వెన్నెల పంచే చంద్రుడు స్వేచ్ఛకు, ప్రేమకు, ఆశకు చిహ్నం. పున్నమి, అమావాస్యల మధ్య కనుమరుగవుతూ, మళ్లీ కనిపిస్తుంటాడు. కనుమరుగు కావడమంటే అంతం కావడం కాదు. అంతం చేయడం ఎవరి తరమూ కాదు. అది ఒక ప్రకృతి సూత్రం. సత్యాన్ని అన్వేషించే, సకల జనుల స్వేచ్ఛా గీతాన్ని పాడే ఉద్యమకారులను, ప్రజల మనుషులను, రాజ్యం కొంతకాలం నిర్బంధించొచ్చేమో కానీ చంద్రుని వెన్నెలలా మెరిసే వారి స్ఫూర్తిని బంధించలేదు. ఇదే విషయాన్ని సుచిత్ర విజయన్, ఫ్రాన్సెస్కా రెఛియా రచించిన ఈ పుస్తకంలో, భారతదేశంలో రాజ్య నిర్బంధం, రాజకీయ ఖైదీల పట్ల అమానవీయత, ప్రజాస్వామిక ఉద్యమాలను అణచివేయడం గురించి లోతుగా విశ్లేషిస్తూ, ప్రజా పోరాటాలు స్ఫూర్తిని ఎత్తిపడతారు.

భీమా కోరేగావ్ అక్రమ అరెస్టులు, CAA (పౌరసత్వ సవరణ చట్టం) సందర్భంగా విద్యార్థి నిరసనకారులను అరెస్టు చేయడం, పోరాడే ప్రజలపై Unlawful Activities Prevention Act (UAPA) వంటి నిర్బంధ చట్టాలను ఆయుధాలుగా ఎలా వాడుతున్నారో ఈ పుస్తకం వివరిస్తుంది. పెట్రేగుతున్న ఫాసిస్టు రాజ్యాన్ని, దాని యంత్రాంగ కుయుక్తులను వ్యతిరేకించే అన్ని శక్తులు ఎలా నిర్బంధానికి గురికావాల్సి వస్తుందో వివరిస్తుంది. ఎంత నిర్బంధం అమలు చేసినా ప్రశ్నించే గొంతులను ఆపలేరని, చల్లటి వెన్నెల పంచే చంద్రుడిని బందీ చేయలేరని ఒక ఆశాభావాన్ని ఈ పుస్తకం వెల్లడిస్తుంది. ప్రజాస్వామ్యం ముసుగులో నిరంకుశ విధానాలు ఎలా అమలవుతున్నాయో, అవి దళిత, బహుజన, ఆదివాసి, మత మైనారిటీల, మహిళల హక్కులను ఏ విధంగా కాలరాస్తాయనే విషయాన్ని, రాజకీయ ఖైదీల దృష్టి కోణం నుండి ఈ పుస్తకం విశ్లేషిస్తుంది.................

  • Title :Chandamamanu Entha Kalam Bandee Cheyagalaru? ?
  • Author :Suchitra Vijayan
  • Publisher :Malupu Books
  • ISBN :MANIMN6080
  • Binding :Papar Back
  • Published Date :Jan, 2025
  • Number Of Pages :190
  • Language :Telugu
  • Availability :instock