చండీ హోమమ్
భక్తులకు, మంత్రోపాసకులకు, సాధకులకు విన్నపం: మంత్ర సాధన, మంత్ర ఉపాసన, మంత్ర అనుష్ఠానం, జపం, హోమం, తర్పణం, మార్జనం, శాంతిప్రక్రియ, పూజ సర్వస్వం కూడా మనం ఆరాధన చేస్తున్న దేవత పట్ల సంపూర్ణ నమ్మకం, భక్తిశ్రద్ధలు ఉన్నవారందరికీ గొప్పమార్గం చూపిస్తుంది ఈ గ్రంథం. ముందు మనకు నమ్మకం ఉండాలి. ఏదో కొన్ని రోజులు చేద్దాము అనుకుంటే అనుకున్న ఫలితములు సిద్ధించడం కుదరదు. ఈ గ్రంథంలో ఇచ్చిన మంత్రానే జపం చేసినా. జీవితానికి సుఖం, సౌఖ్యం, జన్మసాఫల్యం తప్పక సిద్ధిస్తుంది. (ఆత్మార్థం లేదా కామ్యార్థం కోసం చేస్తూ ఉంటాము.) దీనికి భక్తి శ్రద్ధలు మాత్రమే ముఖ్యం. నన్ను ఈ మంత్రం మహోన్నతునిగా మార్చుతుంది అని నమ్మాలి. అప్పుడే అన్ని సాధ్యమవుతాయి. మనకు నమ్మకం ఉంటే ఈ మంత్రం మన జీవితానికి కావలసిన ధనం, ధాన్యం, స్వర్ణం, ఆరోగ్యం, రాజయోగం, అదృష్టం, ఆత్మోన్నతి, కీర్తిప్రతిష్ఠలు సమస్తం సమకూర్చుకోవడానికి
సహాయ పడగలదు.
చిన్నవిన్నపం: కొంతమంది చెబుతారు ఇలా మీరు గురువు వద్దకు వెళ్ళి మంత్రోపదేశం స్వీకరించినపుడు మాత్రమే సిద్ధిస్తుందని. నిజమే కానీ మనకు ఈ కాలంలో ఇప్పటికిప్పుడే నిస్వార్థమైన, మన నుండి ధర్మాన్ని, భక్తిని, ప్రేమను ఆశించే గురువులు లభించడం చాలా కష్టం, అసాధ్యం కూడా... ఒకవేళ ధర్మాన్ని మాత్రమే ఆశించే గురువు లభిస్తే మన అంత గొప్ప అదృష్ట వంతులు ఈ లోకంలో మరెవ్వరూ ఉండరు. ఈ మంత్రోపదేశానికి సంబంధించి కాలభైరవ గురుసంస్థాన మఠం పరమపూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ కొన్ని ప్రత్యేక పౌర్ణమి పర్వదినాల్లో ఉచితంగా మనవద్దనుండి ఏమీ ఆశించకుండా మంత్రోపదేశం చేస్తున్నారు. ఇప్పటికే 102 మహా మంత్రోపదేశములు నిర్వహించినారు. సుమారు 16 వేలకుపైగా భక్తులకు ప్రత్యక్షంగా
మంత్రఉపదేశ, సాధన, హోమం విషయాల కోసం 'KalabhairavaGuru' Youtube ఛానల్ వీక్షించగలరు.............