సాయంసమయపు మంచు
ఆకులపై పరుచుకుంటోంది
ఎవరైనా వెళ్ళి చూపండి
అతన్ని నేను వినగలుగుతున్నాను.
ఉన్న పాటుగా
కదంబ వృక్షం నుంచి
వెలువడిన ధ్వని
వీనులవిందు చేస్తోంది
కవితాత్మకమై
జీవన రహస్యాన్ని
అత్యంత మధురంగా వినిపిస్తూ
ఉద్వేగాన్ని ఉసిగొల్పుతూ
ఆశ్చర్యానందాలకు పురిగొల్పుతూ
ఆ కుదుపుని ఎలా వర్ణించడం
ఆ వేణు నాదం
నాలో మ్రోగుతూనే ఉంది
ప్రాణం తీస్తూ, ప్రాణం పోస్తూ
ఆ యువతి ఎవరు
మిత్రమా, ఎవరా కన్యక
తన చక్కని దేహంతో
నదిని దహింప చేస్తోంది
ఆమె పైయెద పైని స్వర్ణాభరణాలు
పర్వత మంచు పైన చంద్రుని కిరణాల్లా
ప్రకాశిస్తున్నాయి.................