• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Chandrudu Vundadu! Taaralu Vundavu! Kani. . .

Chandrudu Vundadu! Taaralu Vundavu! Kani. . . By Ranganayakamma

₹ 80

ముందు మాట

ఒక నవలికా, ఒక కళా, 10 వ్యాసాలూ, కలిసివున్న సంపుటం ఇది. కధల్నీ, వ్యాసాల్నీ, ఒకే పుస్తకంలో ఇవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే, పాఠకుల్లో వేరు వేరు అలవాట్ల వాళ్ళు ఉంటారు కొందరైతే, కథలే చదువుతారు గానీ, వ్యాసాల వేపు చూడరు. రెండో రకు వాళ్ళు, మొదటి రకం వాళ్ళనించి పూర్తిగా వేరు. వీళ్ళు వ్యాసాను చదువుతారుగానీ, కధల వేపు చూడరు. పాఠకుల్లో ఈ తేడాల గురించి, నేను జానకి విముక్తి' నవలలో రాశాను. ఒకే పుస్తకంలో కధలూ, వ్యాసాలూ కూడా వుంటే, కధల కోసమే ఆ పుస్తకాన్ని తీసుకున్నా, అందులో వున్న వ్యాసాలు పేర్లయినా చదవరా? ఒక్క వ్యానం మీదైనా దృష్టి పెట్టరా? అలాగే, వ్యాసాలు కోసమే ఆ పుస్తకాన్ని తీసుకున్నా, ఈ పాఠకులు కధల వేపు చూడరా? కొత ఆలోచనలు, కధల వల్లా, వ్యాసాల వల్లా కూడా కలుగుతాయి. అంత వరకు ఈ అలవాటు లేని వాళ్ళ కోసం అయినా, అవి రెండూ కలిసి వున్న పుస్తకం , వుండాలి.

కథల్నీ, వ్యాసాల్నీ ఒకే పుస్తకంగా చెయ్యడానికి 2వ కారణం ఏమిటంటే, కధల్నీ, వ్యాసాల్నీ వేరు వేరు పుస్తకాలుగా ప్రింటు చేయించాలంటే, ఖర్చులో కొంతైనా పెరుగుదల తప్పదు. ఒకే పుస్తకంగా చేస్తే, ఆ ఖర్చు కొంత తప్పుతుంది. ఇప్పుడు పేపరు ఖర్చూ, అచ్చుకి సంబందించిన ఇతర ఖర్చులూ బాగా పెరిగిపోయాయి.

ఈ సంపుటంలో వున్న నవలిక ఏ పత్రికలోనూ రాలేదు. వారపత్రికలు లేకపోవడం, ఉన్న ఒక్క వారపత్రికకి పంపకూడదని నేను అనుకోవడం, దినపత్రికల ఆదివారం పుస్తకాలలో సీరియల్ గా వేసే పద్దతి లేకపోవడం ! వంటి కారణాల వల్ల, ఈ నవలికని డైరెక్టుగా పుస్తకంగా తీసుకొస్తున్నాను. 6 నెలల కిందట కూడా, ఇవే కారణాల వల్ల, "రత్నమ్మ గారి కోడలు", "సుబ్బమ్మ గారి అల్లుళ్ళు" అనే 2 నవలికల్ని కూడా, ఇలాగే డైరెక్టుగా, ఒకే సంపుటంలో తీసుకొచ్చాను.

  • Title :Chandrudu Vundadu! Taaralu Vundavu! Kani. . .
  • Author :Ranganayakamma
  • Publisher :Sweet Home Publications
  • ISBN :MANIMN3381
  • Binding :Paerback
  • Published Date :June, 2022
  • Number Of Pages :216
  • Language :Telugu
  • Availability :instock