• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Chandruniko Noolupogu

Chandruniko Noolupogu By Saleem

₹ 75

చంద్రునికో నూలుపోగు

వెన్నెల పుచ్చపువ్వులా కాస్తోంది.

పెరట్లో పెంచుకున్న అందమైన పూలతోటలో వాలు కుర్చీల్లో సేద తీరుతున్నారు. అయాన్ల్లో, అతని భార్య మహిక.

"ఎందుకు నీకు వెన్నెలంటే అంతిష్టం? ప్రతి పౌర్ణమిరోజు భూమ్మీద మనింట్లో ఈ తోటలో కూచుని వెన్నెట్లో తడవడం కోసం, చంద్రుడి నుంచి ప్రయాణం చేసి రావడమంటే కష్టం కదా. నీతో పాటు నన్నూ లాక్కొస్తావు. అక్కడ ఇండియన్ మూన్ రీసెర్చ్ స్పేస్ ఏజెన్సీలో మనం చేస్తున్న పనులకు ఆటంకం కలగదా?" అంది మహిక.

"చంద్రుడి మీద ఇస్రో సహకారంతో ఏర్పాటు చేసిన స్పేస్ ఏజెన్సీలో పని చేయడం కోసం మనల్ని నియమించిన రోజే నెలలో మూడు నాలుగు రోజులు భూగ్రహానికి వెళ్ళి రావడం కోసం చీఫ్ సైంటిష్ట్ నుంచి అనుమతి తీసుకున్నాను. మనలాంటి శాస్త్రవేత్తలకు శనాదివారాలు శెలవలంటూ ఏమీ ఉండవుగా. నెలలో కనీసం మూడు నాలుగు రోజులైనా సేద తీరకపోతే మనసుని లగ్నం చేసి పని చేయలేం" అంటూ నవ్వాడు అయాన్ల్లో,

'ఎంతందంగా ఉందో ఆ నవ్వు... వెన్నెలకన్నా చల్లగా ఉంది' అనుకోకుండా ఉండలేకపోయింది మహిక. ఆ నవ్వు చూసేగా తను ప్రేమలో పడిపోయింది. ఇస్రోలో సైంటిస్ట్గా ఉద్యోగంలో చేరిన కొత్తలో అయాన్జితో పరిచయమైంది. అతను తనకన్నా రెండేళ్ళు సీనియర్. ఇప్పుడతని వయసు నలభై ఎనిమిదేళ్ళు. జుట్టు చెంపల దగ్గర తెల్లబడింది. కొద్దిగా బరువు పెరిగాడు. అంతే. అంతకు మించి ఏ మార్పూ లేదు, మత్తెక్కించే ఆ నవ్వుతో సహా.. ఆమె పెదవుల మీద కూడా సన్నటి నువ్వు మెరుపులా మెరిసి మాయమైంది.

"ఎందుకు నవ్వావు? రిలాక్స్ కావడమనేది శరీరానికే కాదు మనసుకి కూడా అవసరం కదా. అందులో నవ్వడానికి ఏముందని?”

"అదేదో చంద్రుడి మీద కూడా రిలాక్స్ కావొచ్చుగా. శాస్త్రవేత్తల కోసం ఎంత అధునాతనమైన కాలనీని కట్టించి యిచ్చారో కదా. మన విశాలమైన క్వార్టర్లో నేను కూడా రకరకాల పూల మొక్కల్ని పెంచుతున్నా కదా. అక్కడ మన కోసమని ఉయ్యాల....................

  • Title :Chandruniko Noolupogu
  • Author :Saleem
  • Publisher :Navodaya Book House
  • ISBN :MANIMN6397
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :66
  • Language :Telugu
  • Availability :instock