చరిత్ర కొత్తసిలబస్ లో మతతత్వం
యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ఇటీవల దేశవ్యాపితంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల లో Learning Outcomes based Curriculum Framework ను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఇతర అధ్యయన అంశాలతో బాటు చరిత్ర లో కూడా కొత్త సిలబస్ ను ప్రవేశపెట్టడంతో చరిత్ర మత పూరితం కావడం మళ్లీ మొదలైంది. నిజానికది ఆగిపోయిందెప్పుడూ లేదు. మొదటి ఎన్ డి యే ప్రభుత్వంలో మొదలైన ఈ కార్యక్రమం తీవ్ర ప్రతిఘటనల మధ్య కేంద్రం లో ప్రభుత్వం మారినపుడల్లా వెనుకపట్టు పట్టినా బిజెపి పాలిత రాష్ట్రాల్లో కొనసాగుతూనే వచ్చింది. ఇన్నేళ్లుగా సిలబస్ విషయం లో కేవలం మార్గదర్శకాలను మాత్రమే విడుదల చేసి వివరాలను విశ్వవిద్యాలయాలకే వదిలివేసిన యుజిసి ఇప్పుడు దేశమంతా అనుసరించాల్సిన పూర్తి సిలబస్ ని అన్ని అధ్యయన అంశాలతో పాటు చరిత్ర కు కూడా నిర్ధారించి విడుదల చేసింది. మూడు నెలల క్రితం విడుదల చేసిన ముసాయిదా సిలబస్ మీద అభిప్రాయాల్ని ఆహ్వానించింది కానీ అందిన అభిప్రాయాల మదింపు ఏమిటో తెలియరాలేదు. అయితే సిలబస్ ను ఖరారు చేసినట్లు మాత్రం తెలుస్తోంది.........................