Charitralni cherigiposthu. . (Samakalina Samajika Sahitya Vyasalu) By Jupaka Subhadra
₹ 100
ఆ పీడనకు గురౌతున్న సమస్త ప్రజల వేదనా భరిత 1 గొంతుక సుభద్ర వ్యాసాల్లో బలంగా ప్రతిఫలిస్తుంది. స్వచ్ఛభారత్ ప్రతినిధులైన సఫాయీకర్మచారీల నుండి వేలాదిమందికి ప్రసవం చేసిన పద్మశ్రీ సూలగిత్తి నర్సవ్వ వరకూ సుభద్ర కలంతో బలంగా ప్రతిధ్వనిస్తారు. మహిళలు, దళితులు, ట్రాన్స్ జెండర్లూ.. సమాజ విస్మృత సమూహాలు, బాధితులు ఆమె రచనకు శిల్పం. రూపం - సారం కలబోతగా చరిత్రను చెరిగిపోస్తూ సమకాలీన సామాజిక, సాహిత్య వ్యాసాలను సుభద్ర అక్షరాలుగా చదవండి.
జూపాక సుభద్ర ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, కధకురాలు, కాలమిస్టు, వ్యాసకర్త, అనువాదకురాలు, పరిశోధకురాలు, నాయకురాలు, వక్త, సంఘ సంస్కర్త, సామాజిక విప్లవ మూర్తి. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తూ పీడిత ప్రజలు, మహిళల కోసం కలం, గళంతో బహుముఖ ప్రజ్ఞను చాటిచెప్పారు. మానవ హక్కులు, గౌరవం కోసం మానవత్వ సమానత్వ సాధనకోసం కృషి చేస్తున్న రచయిత్రి, నేత.
- Title :Charitralni cherigiposthu. . (Samakalina Samajika Sahitya Vyasalu)
- Author :Jupaka Subhadra
- Publisher :Bhoomi Books Trust
- ISBN :MANIMN2510
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :104
- Language :Telugu
- Availability :instock