• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Chattam Nyayam Magazine November 2024

Chattam Nyayam Magazine November 2024 By Telugu Law Publications

₹ 50

అత్యవసర సమస్య - అర్థరహిత మీమాంస !

మహిళల జీవితాలతో నెలసరి సమస్యకు విడదీయరాని సంబంధం ఉంది. నెలసరి సమయంలోను, నెలసరికి ముందు.. మహిళలు పడే బాధను మహిళలు మాత్రమే పూర్తిగా అర్ధం చేసుకోగలరు. నెలసరి అనేది వ్యాధి లేదా వైకల్యం కాదని, సహజమైన ప్రక్రియ మాత్రమేనని ఒక సమకాలీన రాజకీయ నాయకురాలు చెప్పినది నిజమే కావచ్చు. కానీ ఎంతో యాతన, వేదనతో రుతుచక్రంలో మహిళ చాలా రోజులు గడుపుతుంది. అలాంటప్పుడు దీన్ని సాధారణ సమస్యగానే చూడాలనడం ఎంతవరకు సమంజసం? తమ జీవితంలో ప్రతి నెలా మహిళలు ఇలాంటి పరిస్థితిని దాటుకొని రావాల్సి ఉంటుంది. కొంతమందికి ఒకటి లేదా రెండు రోజులు, మరికొంతమందికి ఇంకా ఎక్కువ రోజులు ఈ సమస్య ఉండవచ్చు. నెలకు కనీసం రెండు మూడు రోజుల చొప్పున జీవితంలో వారు సగటున 3,000 రోజులు నెలసరి నొప్పులతో, తీవ్ర వేదన అనుభవిస్తారన్నది ఒక అంచనా. దాదాపు ప్రసవ వేదననే తలపించేంత యాతనతో జీవితంలో ఎనిమిదేళ్లకుపైగా వారు చెప్పుకోలేని బాధతో, నిస్సహాయంగా గడపాల్సిన దుర్భర పరిస్థితి. నెలసరి సమయంలో దాదాపు 200 రకాల మార్పులు శరీరంలో చోటుచేసుకుంటాయని వైద్య శాస్త్రం చెబుతోంది. కొందరైతే తీవ్రమైన కడుపునొప్పి, ఓవర్ బ్లీడింగ్, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వికారాలతో, పొత్తి కడుపులో పోట్లతో బాధపడుతుంటారు. ఈ బాధ ప్రతి మహిళకూ నెలనెలా నరకప్రాయమైన పరీక్షగా ఉంటుంది. ఈ యాతనపడే వారికి నెలసరి సెలవు ఎంతో ఉపయోగమని, ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటే ఆ తర్వాత వారు ఆరోగ్యంగా ఉండటమేకాక, మరింత శక్తి పుంజుకుని హుషారుగా పనిచేస్తారన్నది రుతుస్రావం యాతనలపై పరిశోధన చేసిన వారు చెబుతున్న మాట. ఈ కారణంగానే నెలసరి సెలవు మంజూరు చేయాలంటూ ప్రపంచ వ్యాప్తంగా మహిళలు గళం విప్పారు. అయితే, ఈ సెలవు అత్యవసరమని ఉద్యోగినులు వాదిస్తుండగా, వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఇది దెబ్బతీస్తుందని వాదించే వర్గాలూ ఉన్నాయి. ఎంతో ముఖ్యమైన ఈ అంశంపై చర్చ, మీమాంస దశాబ్దాల తరబడి కొనసాగడం శోచనీయం. ఈ నేపథ్యంలో నెలసరి సెలవు ప్రాధాన్యత, ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వైఖరి, కేంద్ర ప్రభుత్వ ధోరణి, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పరిస్థితి తదితర అంశాలతో ''నెలసరి, చర్చతోనే సరి' శీర్షికన ప్రత్యేక కథనం ఈ నెల కవర్ స్టోరీగా నిలిచింది. ఇక కుటుంబ వ్యవహారాలు, విద్య, ఉద్యోగం, వినియోగదారుల హక్కులు, సమాచార హక్కు తదితర అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులకు, న్యాయపరమైన సమకాలీన అంశాలకు ఈ సంచికలోనూ తగిన ప్రాధాన్యం దక్కింది. అందరికీ న్యాయ సమాచారం అన్న సంకల్పంతో ప్రతినెలా తెలుగులో వెలువడుతున్న 'చట్టం న్యాయం' మాసపత్రికను పాఠకులు ఎప్పటిలా ఆదరిస్తారని ఆశిస్తున్నాం..........................

  • Title :Chattam Nyayam Magazine November 2024
  • Author :Telugu Law Publications
  • Publisher :Telugu Law Publications
  • ISBN :MANIMN5842
  • Binding :Papar Back
  • Published Date :Nov, 2024
  • Number Of Pages :65
  • Language :Telugu
  • Availability :instock