మనిషి ప్రకృతి నుంచి నేర్చుకున్నాడు. ప్రశ్నకు సమాధానం వెతుక్కున్నాడు. ప్రపంచ పురోగతికి శ్రమను జోడించాడు. కానీ.... దారి మధ్యలో ప్రశ్నను విస్మరించాడు. అవును... ప్రశ్నించడం ఎప్పుడో మర్చిపోయాడు. కానీ ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఆరాటపడే పిల్లల్లో మాత్రం ప్రశ్న సజీవంగా మిగిలింది. అందుకే “ఇలా చేస్తే ఏమవుతుంది? అలా ఎందుకు చేయకూడదు?” లాంటి ప్రశ్నలను సంధిస్తూనే ఉంటారు పిల్లలు. పెద్దలు దాచి పెట్టే రహస్యాల గుట్టు విప్పాలనుకుంటారు. అలాంటి ఆరాటమే ఈ పిల్లలను చీకటి గుహలోకి నడిపించింది. ఆ నడక ఊహించని పరిణామాలవైపు దారితీసింది. అయినా... వాళ్లు పరిస్థితులకు లొంగిపోలేదు. నిబ్బరాన్ని కోల్పోలేదు. గుండె ధైర్యంతో నిలబడ్డారు. చీకట్లను ఓడించి తిరిగి వెలుగు ఒడికి చేరుకునే వరకూ పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని అక్షరాల్లోకి ఒంపారు రచయిత. ఉత్కంఠభరితంగా సాగే కథనాన్ని పాఠకుల ముందుంచారు. విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేందుకు పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందీ రచన. ఎలక్ట్రానిక్ గార్టె తో కాలక్షేపం చేస్తున్న పిల్లలకు పుస్తకాల మీద ప్రేమను పెంచే ప్రయత్నం ఇది. పబ్లీ తరానికి అక్షరాల్లో ఆత్మస్టైర్యం నింపితూ 'ఛాయ' ఈ పుస్తకాన్ని వెలువరిస్తోంది.