• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Chemchayugam

Chemchayugam By Dr A Subramanyam

₹ 50

తొలి ప్రయత్నాలు

ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభం నుంచే భారతదేశం భారీ మార్పులకు గురవుతూ ఉంది. ఈ మారుతున్న కాలంలో అణగారిన భారతీయులు ఇక ఏమాత్రం వెనకబడి ఉండడానికి వీలులేదు. అగ్రకులాల వారు స్వరాజ్యంకోసం పోరాడుతుంటే అణగారిన వర్గాలు ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తున్నాయి. బానిసలు స్వతంత్రంకోసం స్వపరిపాలనకోసం కేకలు పెడుతుంటే, ఇప్పటివరకు ప్రపంచందృష్టికే వెళ్ళని బానిస సంకెళ్ళనుండి తరతరాల బానిసత్వం నుండి అవమానాల నుండి విముక్తి కోసం బానిసలకు బానిసలు ప్రతిధ్వనులు చేస్తున్నారు. హిందూ అగ్రకులాలు తొందరగా అధికార మార్పిడి చెయ్యమని బ్రిటిష్ వారిపై ఒత్తిడితెస్తూ అధికారం చెలాయించడానికి కావలసిన నిర్మాణాలను, నైపుణ్యాలను సంతరించుకొంటున్నారు. అణగారిన వర్గాలు ఆ ఆలోచనకే భయపడిపోతున్నారు. తమకు తగిన రక్షణలు, పరిహారం కల్పించకుండా స్వతంత్రం ప్రకటిస్తే తరతరాలుగా తమను అణచివేతకు గురిచేసిన అగ్రకుల హిందువుల చేతులలో తమ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందోనని వారిభయం.

అస్పృశ్యులకు అణగారిన వర్గాలకు ఇది ఆహ్వానించదగిన పరిణామమే. శతబ్దాలుగా వాళ్ళు అగ్రకుల హిందువులకు స్వచ్ఛంద బానిసలుగా ఉన్నారు. ఇప్పుడెందుకీ మార్పు? ఈ మార్పుకు కారణం కూడ బ్రిటిష్ వారిపాలనే. బ్రిటిష్ పాలకులతో పాటే పాశ్చాత్య విద్య, పాశ్చాత్య నాగరికత సంస్కృతులు భారతదేశంలోకి ప్రవేశించాయి. వాటి పరిచయంతో అణగారిన వర్గాలలో ఒక నూతన చైతన్యం వచ్చింది. బ్రిటిష్పాలన వల్ల అనేక ఇతర అంశాలు, శక్తులు బయటపడి పనిచేశాయి. అణగారిన వర్గాలలో సమీకృతస్థాయి ఆశలు, కోరికలు వ్యక్తీకరించబడినాయి.

ఈ కాలంలోనే అణగారిన కులాలు అస్పృశ్యతకు, అన్యాయమైన సామాజిక వ్యవస్థలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పంజాబ్ నుండి బెంగాల్వకు ఆది ధర్మీలు, జాతవ్లలు, కురిలులు, పాశీలు, పాశ్వాన్లు, నామ శూద్రులు ఆత్మగౌరవం కోసం ఆ విశ్రాంతంగా పోరుచేస్తున్నారు. దిగువన అహిర్వారులు, బేర్వాలు, సత్నామీలు, మహర్లు, ఆది ఆంధ్రులు, ఆది-కర్ణాటకులు, ఆది-ద్రావిడులు,.......................

  • Title :Chemchayugam
  • Author :Dr A Subramanyam
  • Publisher :Samatandra Prachuranalu Hyd
  • ISBN :MANIMN4967
  • Binding :Papar back
  • Published Date :2010 3rd print
  • Number Of Pages :129
  • Language :Telugu
  • Availability :instock