ఈ 'చెణుకులు' రచయిత చిన్నతనము నుండి ఉత్తేజకరమైన స్వభావము కలవాడు. రచనా నైపుణి కలవాడు. నా సన్నిధిలో సంస్కారము, శిక్షణమును, నా పర్యవేక్షణలో ప్రాచీన భారతీయ విజ్ఞానమును ఉపదేశము పొందినవాడు. -
పరమగురువుల అడుగుజాడలలో జీవితమును నడుపుచు వారి దర్శనమును ప్రచారము చేయుట ముఖ్య కర్తవ్యముగా దీక్ష వహించినవాడు.'యువధర్మ శతకం' ఇతనిచేత వ్రాయించుకున్నది. ఇలాంటి రచనలు సవ్యసాచిగ వ్రాస్తాడు.
20వ శతాబ్దంలోని మహాపురుషులలో మాస్టర్ ఇ.కె. ఒకరు. వారిని మరల మరల మనకు చూపించటానికి సత్యదేవ్ గారు రచించిన “మాస్టర్ ఇ.కె. జీవిత చరిత్ర” అనే గ్రంథం ఉపకరించ గలదు.