అది 1908వ సంవత్సరం. భారతదేశమంతా తెల్లదొరలను దేశం నుండి పారద్రోలాలని కలసికట్టుగా నడుం బిగించిన సమయం. కలకత్తాలో ఇంటింటా రహస్యంగా మంతనాలు జరుగుతున్నాయి. పెద్దలు, పిల్లలు, మగవారు, ఆడవారు అనే తేడా లేకుండా పోరాటంలో పాల్గొంటున్నారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకొని పన్నెండేళ్ళ అమర్సేన్ తాను కూడా దేశం కోసం ఏదో ఒకటి చేయాలని తపించిపోతున్నాడు. తెల్లవాళ్ళంటే విముఖత ఆ చిన్ని నరాల్లో జీర్ణించుకు..................