• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Chigurantha Aasa

Chigurantha Aasa By Sivalakshmi

₹ 150

పిల్లల కలల ప్రపంచం

పిల్లల సినిమాలని వాటి సమీక్షలని విశ్లేషించే ముందు మనం మన బాల్యంలోకి తొంగి చూడాలి. మనల్ని ఆకట్టుకున్న సినిమాలు, మనపై ప్రభావం చూపిన సినిమాలు గుర్తొస్తాయి. అవి ఎందుకు ప్రభావం చూపించాయో ఇప్పుడు వయసు పెరిగాక మరో కోణంలో అర్థమవుతుంది.

వాటిని పిల్లల కోసం తీసిన సినిమాలుగా, పిల్లల గురించి పెద్దల కోసం తీసిన సినిమాలుగా విభజించవచ్చు. పిల్లల కోసం తీసిన సినిమాలు ఏ వయసు వారి కోసం తీశారో కూడా చూడాలి. ఎందుకంటే, వారి వారి వయసుని బట్టి జ్ఞాన సముపార్జన, అవగాహన వుంటాయి. వారి మానసిక ఎదుగుదలకి అనుగుణంగా మనం వారికి విజ్ఞానాన్ని అందించగల్గితే వారు ఎంతో బాగా ఎదుగుతారు.

నా చిన్నప్పుడు చూసిన సినిమాల్లో నాకు బాగా గుర్తుండిపోయిన దృశ్యం -'మాబాబు' సినిమాలో సావిత్రి తన కొడుక్కి పాడి వినిపించే 'చల్ చలో అని స్వారీ చేసెను టక్ టక్ టక్' అనే ఫాంటసీ. తర్వాత చాలా ప్రభావం చూపింది 'కాబూలీవాలా' సినిమా. అందులో మాట్లాడే పక్షి, చందమామలో రాట్నం వడికే ముసలమ్మ ఇప్పటికీ గుర్తు. టాగూర్ కథని బిమల్రాయ్ సినిమాగా తీస్తే, బల్రాజ్ సహానీ ఆ పాత్రకి ప్రాణం పోశాడు. ఆ సినిమా పిల్లల్ని ఎంతగా ఆకట్టుకుందంటే, మా స్కూల్లో ఆ సినిమా ఘట్టాలను, 'కాబూలీవాలా' పాటని కలిపి నాటకంగా వేసి మెప్పించారు. 'మినీ' పాప ఆ పాత్రని వేసిన మా స్నేహితురాలు పల్లవి ఇప్పటికీ గుర్తు...............

  • Title :Chigurantha Aasa
  • Author :Sivalakshmi
  • Publisher :Kuhoo Virasam Prachuranalu
  • ISBN :MANIMN4114
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :171
  • Language :Telugu
  • Availability :instock