• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Chikati Pata

Chikati Pata By Gabriel Garcia Marquez

₹ 120

మిగ్యుల్ లిట్టిన్ :

చిలేలో అజ్ఞాత వాసం

ఇరవై మూడువేల అడుగుల ఎత్తునుంచి చూస్తుంటే ఎడమ వేపున అకన్కాగువా వెన్నెల్లో మెరిసిపోతున్న ఉక్కు ముక్కలాగుంది. పెరాగ్వేలోని అసన్సియోన్ నుంచి బయల్దేరిన లాడెకో విమానం శాంటియాగోలోని వుడాహ్యూల్ విమానాశ్రయంలో గంట ఆలస్యంగా దిగబోతోంది. విమానం భయం గొలిపే విలాసంలో ఎడమ రెక్కను వంచింది. కిరకిరలాడే లోహాల చప్పుడుతో తిరిగి సమంగా మారింది. మూడు గంతులతో అనుకోకుండా నేలమీద దిగింది. పన్నెండు సంవత్సరాల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వస్తున్నాను. కాని నాలో నేను ఇప్పటికీ ప్రవాసంలోనే ఉన్నాను. మారుపేరుతో, తప్పుడు పాస్పోర్టుతో వస్తున్నాను. చివరికి నా వెంట భార్యగా ఉన్న అమ్మాయి కూడా నా భార్య కాదు. నేను మిగ్యుల్ లిట్టినన్ను. హెర్నాన్, క్రిస్టినాల కొడుకును. సినిమా దర్శకుణ్ని. నా ముఖం, రూపురేఖలు ఎంతగా మార్చివేశారంటే సన్నిహిత మిత్రులు కూడా నన్నిప్పుడు పట్టపగటి వేళనైనా గుర్తించలేరు!

నా ఈ రహస్యం తెలిసినవాళ్లు చాలా తక్కువ మంది. అందులో ఒకరు ఇప్పుడు నాతోనే ఉన్నారు. ఆమె ఎలీనా. ముచ్చటైన అమ్మాయి. చిలేలోని ప్రతిఘటనా సంస్థ ఆమెను నాకు సహాయంగా పంపింది. అజ్ఞాతవాసంలో పనులు చేయడానికి, రహస్య సంబంధాలు ఏర్పరచడానికి, సమావేశ స్థలాలు కుదర్చడానికి, ఎవరిని ఎప్పుడు కలవాలో నిర్ణయించడానికి, మా భద్రత చూడడానికి ఎలీనాను పంపించారు. యూరప్ లో ఉంటూ ఇటువంటి రాజకీయ కార్యక్రమాల మీద చిలేకి వెళ్లి వస్తూ ఉండడం ఎలీనాకు అలవాటే. నన్ను పోలీసులు పట్టుకున్నా, మాయం చేసినా, అనుకున్న ప్రకారం ఎవరినైనా కలవడానికి పోకపోయినా వెంటనే ఆ విషయం ప్రచారం చేసి, అంతర్జాతీయంగా ఆందోళనకు వీలు కల్పించడం ఎలీనా బాధ్యత. మా గుర్తింపు పత్రాలలో మేమిద్దరం...............

  • Title :Chikati Pata
  • Author :Gabriel Garcia Marquez
  • Publisher :Swecha Sahity Hyd
  • ISBN :MANIMN5137
  • Binding :Papar back
  • Published Date :Feb, 2024
  • Number Of Pages :108
  • Language :Telugu
  • Availability :instock