• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Chikati Rojulu

Chikati Rojulu By Ampasaiah Naveen

₹ 275

చారిత్రక పత్రం చీకటిరోజులు

న తొలి నవల 'అంపశయ్య'తో సాహిత్య ప్రపంచంలోకి ఒక వెలుగుతో దూసుకు వచ్చిన రచయిత నవీన్. తర్వాత కాలంలో ఆ నవల చైతన్యస్రవంతిగా, ఆధునిక శిల్ప ప్రయోగంగా, విశ్వవిద్యాలయాల్లో, యువతరం అంతరంగ సంక్షోభానికి అద్దం పట్టిన కళాఖండంగా మన్ననలను పొంది, కొత్తతరం రచయితలకు ఒరవడి పెట్టింది. ఆ తొలి విజయం రచయిత నవీన్ని నానబ్బుషే కురుతే కావ్యం స్థాయిలో కాపాడి శాశ్వతంగా ఉన్నత ప్రమాణాల దిశలో ఉత్తమ అభిరుచుల బాటలో నడిపించ సాగింది. ఒక ఉదాత్తమైన బాధ్యతకు, సాహిత్యంలో, కట్టుబాట్లను నిర్ణయించి జీవితాన్ని శాసించసాగింది.

'అంపశయ్య'ను రాత ప్రతిలో చదివినప్పటి నుంచీ ఆ నవలతో, ఆరచయితతోనూ నా అనుబంధం. అప్పటి నుండి నవీన్ ప్రతి కొత్త రచనా ఒక విలక్షణమైన ప్రయోజనం, ఒక వినూత్నమైన ప్రయోగం లేకుండా ఉండదు అన్న భావం ఏర్పడిపోయింది.

అట్లానే చదివాను ఇంకా పురిటి వాసనల్లో ఉన్న 'చీకటి రోజులు' నవలను. 1978లో తొలిసారిగా చదివినప్పుడు తెలుగులో ఒక అద్భుతమైన రచన వచ్చింది అన్న సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నవల రాయగలిగిన రచయిత మనోస్థైర్యానికి ఆశ్చర్యపోయాను. భయపడ్డాను. అయితే ఆరోజు నించీ నవీన్ పట్ల రచయితగా నా గౌవరం మరింత ఆత్మీయం అయింది. భారతీయ భాషా సాహిత్యాల్లోనే ఈ నవల అపురూపమైనదిగా నిలుస్తుందని నమ్మాను. ఆ రోజుల్లోనే నేను చదివిన స్నేహలతా. రెడ్డి కర్నాటకలో తన పోలీస్ నిర్బంధం గురించి రాసిన జైలు దినచర్య, విదేశీ వనిత మేరీ టేలర్ 'మై ప్రిజన్ డేస్ ఇన్ ఇండియా' ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నాయర్ 'జడ్జిమెంట్' ఇవన్నీ కలిసి నాకు 'చీకటి రోజులు' నవల అయింది.

అప్పుడు ఢిల్లీలో ఉన్నాను. 'చీకటిరోజులు' నవలను ప్రశంసిస్తూ రచయితకు ఉత్తరం రాయడం కోసం కలం తీసి - ఉత్తరం కాదు - వ్యాసం పత్రికలో ప్రచురించి రచయితను ఆశ్చర్య పరుద్దామన్న ఆలోచన కలిగి వ్యాస రచన ప్రారంభించాను. ఆ రచన, మరికొన్ని పుస్తకాలు అవసరమై, అవి దొరక్క ఆదిలనే ఆగిపోయింది.

ప్రపంచ సాహిత్యంలో నాకు చాల ఇష్టమైనవి రష్యన్ నవలలు. నవలల్లోని మానవతా సౌందర్యం నన్ను ఆకర్షించినంతగా ఫ్రెంచి, ఇంగ్లీషు భాషల్లో వచ్చిన................

  • Title :Chikati Rojulu
  • Author :Ampasaiah Naveen
  • Publisher :Anvikshini Publishars
  • ISBN :MANIMN4860
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :266
  • Language :Telugu
  • Availability :instock