చైనాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవ క్రమంలో బాగంగానే పీడిత రైతాంగ స్త్రీ లతో మహిళా ఉద్యమం నిర్మాణమయింది. అది క్రమక్రమంగా విస్తరించి మహిళల చైతన్యాన్ని పెంచడంలో ఎంతో కృషి చేసింది మహిళలను సామాజిక ఉత్పత్తిలోకి, వర్గపోరాటంలోకి, భూసంస్కరణలోకి సమీకరించడం జరిగింది. విముక్తి తరువాత కూడా చైనా మహిళా ఉద్యమం ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకే సాగింది.
చైనా మహిళా ఉద్యమ చరిత్రలో 1970 దాకా సాగిన ఈ ఉజ్వల దశల్ని అద్యయనం చేసి, వాటిని సైద్ధాంతిక దృక్పథం నుంచి విశ్లేషించడానికి క్లాడీ బ్రాయెల్ ఈ పుస్తకంలో ప్రయత్నించారు. ప్రత్యేకించి చైనా విప్లవానుభవం గురించే రాసినా, సాధారణ స్త్రీ సమస్యల విశ్లేషణకు అవసరమైన ఆలోచనలను ఈ పుస్తకం ప్రేరేపిస్తుంది. సామాజిక శ్రమ, ఇంటిపని, పిల్లల పెంపకం, కుటుంబం, లైంగిక సంబంధాలు అనే ఐదు అంశాలతో స్త్రీ సమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పే ఆలోచనాత్మక పుస్తకం ఇది.