దీక్షితులుగారు ఈ వుత్తరాలు దాచారు. ఆయన శ్రమ ఎవరికో ఒకరికన్నా ఉపకరిస్తుందని ఆశ - ఈనాడు.
ఈ వుత్తరాలన్నీ ఇంగ్లీషులో వ్రాసినవి. చాతకాని చోట్ల తప్ప తక్కినదంతా తెలుగు చేశాను.
ఇతరులని గాయపరుస్తాయన్నవీ, అధికార్లని పేరు వరసలుగా తిట్టినతిట్లూ, రెండుమూడు బూతులు తప్ప, తక్కినవిషయమంతా ఉన్నది ఉన్నట్లు తెలిగించాను.
ఏమి interest ఇయ్యవన్న కొన్ని సంగతులు వొదిలేశాను.
ఆయన నాకు వ్రాసిన ఉత్తరాలు దాచని, నా నిర్లక్ష్యం, నా అంధత్వం , అల్పత్వం - క్షమించతగినని కావు.
ఈ వుత్తరాలలో నేను వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయా నాటివి. ఈనాటికి చాల విషయాల్లో నా అభిప్రాయాలు మార్పు చెందాయి, చెందుతున్నాయి.
-చలం.