Logili Books

Cinema

Chiranjeevi Sikahara Darshanam

By Chillagattu Srikanth Kumar

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Chiranjeevi Sikahara Darshanam
Publisher
Vedha Varshini Prachuranalu
ISBN
MANIMN7167
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
179
Language
Telugu
Availability
In Stock
About this book

శతమానం భవతి

"శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియై

ఆయుష్యే వేంద్రియై ప్రతితిష్టతిః”

2004వ సంవత్సరం ఆగస్టు 22వ తేదీ సమయం ఉదయం పదిగంటలు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ లోని శ్రీవేంకటేశ్వరాలయం

ఎటు చూసినా కోలాహలం, పండుగ వాతావరణం.... మామిడి తోరణాలు, రంగవల్లికలు, మంగళ వాయిద్యాలు, అరటిస్తంభాలు.... “శ్రీ ఆంజనేయస్వామి దీక్ష" చేపడుతున్న భక్తాదులు.... ఒకవైపు. “ఏదో అద్భుతం జరగబోతోంది, ఆ అద్భుతాన్ని కనులారా వీక్షించాలనే ఉత్సుకతతో ఉన్న ప్రేక్షకాభిమానులు మరొక వైపు"....

ఆహ్లాదకరంగా వస్తున్న చల్లటిగాలులకు తోడు శ్రవణానందకరంగా వినిపిస్తున్న భక్తిగీతాలతో మనసంతా ఆనందడోలికల్లో ఊగుతోంది.... ఒక్కొక్కరే వస్తున్నారు. తెలుగు సినీపరిశ్రమ లోని దిగ్గజాలు.....

ఆ దిగ్గజాలతో పాటు మేరునగధీరుడైన మెగాస్టార్ చిరంజీవిగారు...

శ్రీ ఆంజనేయస్వామి దీక్షను చేపడుతున్నది వేరెవరో కాదు చిరంజీవిగారి అభిమానులే... ఆ భక్తాదులైన అభిమానులకు మాలధారణ చేయడానికి విచ్చేయబోతున్నది శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీ రామానుజ చిన జీయర్ స్వామిగారు.

2004వ సం|| ఆగస్టు 22వ తేదీన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ చినరామానుజ జీయర్ స్వామి చెంత శేష వస్త్రాలంకారులై శ్రీ చిరంజీవి, ప్రక్కనే శ్రీ అల్లు అరవింద్ తదితరులు...

శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీ రామానుజ చిన జీయర్ స్వామిగారి అమృతవాక్యాలు విని తరించడానికి ప్రపంచమంతా పరితపిస్తుంది. వారి పవిత్రమైన పాద సంస్పర్శతో తమ ఇళ్ళు పావన మౌతాయని వారి కోసం ఎందరెందరో ఎదురు చూస్తారు అటువంటి మహిమాన్వితులైన చిన జీయర్ స్వామిగారు చిరంజీవిగారి జన్మదిన వేడుకలకు విచ్చేసి చిరంజీవిగారి అభిమానులకు మాలధారణ చేయాలనుకోవడం ఎంత ఆనంద దాయకమైన విషయం.... అసలు పీఠాధిపతులు, మఠాధిపతులు సినిమా కళాకారులంటే తక్కువ భావంతో దరిచేరనీయరు.........................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?