• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Chirugali Naa Premikudu

Chirugali Naa Premikudu By Ade Caparas Manilah

₹ 200

                              కాన్ సెర్డినా (Concertina) అనేది ఓ సంగీత పరికరం. Accordi. ons, harmonica లా ఇది గాలిని నియంత్రించడం వలన చక్కని ధ్వనులను పుట్టిస్తుంది. గాలి తిత్తులు, బటన్లతో ఉండి రెండు చేతులూ వాడాల్సి వస్తుంది. ఇంగ్లండ్, జర్మనీలలో రూపొందించబడిన ఈ సంగీత పరికరం ఐర్లండ్, ఇంగ్లండ్, సౌత్ ఆఫ్రికాలలో, టాంగో, పొల్కా సంగీతంలో విరివిగా ప్రాచుర్యంలో ఉన్నది.

                              ఈ 'కాన్ సెర్టినా'ను Ade Caparas Manilah స్వాప్నికురాలు, కవయిత్రిగా, తనకు చిహ్నంగా; చిరుగాలిని ప్రేమికుడు, కవిగా భావించుకుని వారిద్దరి కలయికను శృంగారపరంగా అద్భుతంగా వర్ణించింది. స్వతహాగా Interior Designer కావడంతో ఆమెలోని కళాభిజ్ఞత ఈ కవితలలోని వాక్యా లలో ప్రస్పుటంగా కానవస్తుంది. కవిత్వమనేది పాఠకుడి దేహం, మనస్సు, ఆత్మలలో ముద్రవేసి కలవరం కలిగించాలంటుంది Ade Caparas Manilah (Ade C.).

                               వివిధ దేశాల కవుల, కవయిత్రుల కవిత్వాన్ని తెలుగు పాఠకులకు అనువదించి అందిస్తున్న కార్యక్రమంలో భాగంగా వెలువడుతున్న - చిరుగాలి నా ప్రేమికుడు The wind my lover - ద్విభాషా కవిత్వాన్ని తెలుగు సాహితీలోకం: ప్రేమతో ఆదరిస్తుందని విశ్వసిస్తూ........

 

                                                                                                                      - డాక్టర్ లంకా శివరామప్రసాద్,

  • Title :Chirugali Naa Premikudu
  • Author :Ade Caparas Manilah
  • Publisher :Dr.Lanka Siva Rama Prasad
  • ISBN :MANIMN2716
  • Binding :Paerback
  • Published Date :2018
  • Number Of Pages :98
  • Language :Telugu
  • Availability :instock