మలేషియాలో తెలుగువాణి
"శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ..... తెలుగువారి తొలికావ్యం ఆంధ్ర మహాభారతంలోని నాందీ శ్లోకాన్ని నన్నయ భట్టారకులు ప్రవచిస్తున్నారు. "దేశభాషలందు తెలుగులెస్స. అటు శ్రీనాథుడూ, ఇటు కృష్ణదేవరాయ భూనాథుడూ పరమ యుగళంగా, ప్రౌఢ గళంగా పలుకుతున్నారు.
"కలదయేని పునర్జన్మ కలుగు గాక
మధుర మధురమైన తెలుగు మాతృభాష
అభినవ కవితా పితామహులు ఆచార్య రాయప్రోలు సుబ్బారావుగారు. తేటగీతిగా తెలుపుతున్నారు.
"తెలుగుజాతి మనది- నిండుగ
వెలుగు జాతి మనది."
నా గొంతు నాగుండెలోనే చిత్రంగా చలిస్తూ గీతికగా మ్రోగుతున్నది. ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ? ఏ సభలో? వేములవాడలోనా? నారాయణగూడలోనా? గుంటూరులోనా? నెల్లూరులోనా? ఈ స్వరాలు ఎక్కడివి? ఎక్కడివో కావు. ఇక్కడే వినిపిస్తున్నవి. ఎయిరిండియా విమానంలో ఎగిసిపోతున్న మా మదిలో ధ్వనిస్తున్నవి. మేమంటే నేను, అగ్రజుడు డాక్టర్ దాశరథి.
మలేషియా పర్యటనకు మా ఇద్దరినీ కలిసి రమ్మన్నది అక్కడి................