• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Chitikalo Chikitsa

Chitikalo Chikitsa By Dr G V Purna Chandru B A M S

₹ 300

ఎదిగే పిల్లలకు విలువైన పానీయం 'రసాల'

గట్టి పెరుగును తేలికగా చిలకండి. చిక్కటి మజ్జిగ అవుతాయి. మిరియాలు, శొంఠి ఈ రెండింటినీ విడివిడిగా నేతిలో వేయించి మెత్తగా దంచి తగినంతగా వాటిని ఈ మజ్జిగలో కలపండి. తగినంత ఉప్పు, కొద్దిగా పంచదార కూడా దీన్లో కలిపి బాగా కలియబెట్టండి. ఇది అద్భుతమైన పానీయం! దీన్ని “రసాల” అని ఆయుర్వేద శాస్త్రంలో పిలుస్తారు.

ఎదిగే పిల్లలచేత స్కూలుకు వెళ్ళబోయే ముందు, స్కూలు నుంచి వచ్చాక దీన్ని త్రాగిస్తే వాళ్లకు అలసట పోయి, చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. శరీర పుష్టి కలుగుతుంది. యాక్టివ్ గా వుంటారు పిల్లలు. ఆడపిల్లలకు, మగపిల్లలకు అందరికీ మంచి పానీయం ఈ రసాల. కాలేజీలకు వెళ్ళే అబ్బాయిల చేత తాగిస్తే పైన చెప్పిన శరీర పుష్టి వగైరా లాభాలేకాకుండా మరొక అదనపు ప్రయోజనం కూడా వుంది. వారికి ఈ రసాల' పానీయాన్నీ రోజూ రెండు పూటలా పెద్ద గ్లాసుడు చొప్పున ఇవ్వండి. శుక్రవృద్ధి కలుగుతుంది. బుద్ధిగా చదువుకుంటారు. అంతేకాదు రుచిని కల్గిస్తుంది. అన్నం తినాలనే | కోరిక పుడుంది. తిన్నది వంటబట్టుంది. ముఖ్యంగా అమీబియాసిస్ అనే వ్యాధి వున్నవారు 'ఈ రసాల' పానీయాన్ని త్రాగితే వ్యాధి కంట్రోల్లో వుంటుంది.

దురదగొండి విత్తులతో ఆయాసాన్ని తగ్గించండి

ఎప్పుడూ ఆయాసం వస్తూ వుండే రోగులు దురదగొండి విత్తులు వాడితే చాలావరకూ ఉపశమనంగా వుంటుంది. నల్లగా చిన్న నేరేడు కాయలా ఉంటాయి దురదగొండి విత్తులు, వీటిని ఆవుపాలలో ఉడికించి పై పొట్టు తీసేసి, మెత్తగా దంచి, నేతిలో వేయించి, బెల్లంపాకంలో వేసి చిన్న లడ్డూలా చేసుకుని తెల్లవారు ఝామున ఒకటి లేక రెండు తిని పాలు తాగితే రుచిగా వుంటుంది. శక్తి కలుగుతుంది. ఆయాసం, దడ, వణుకు తగ్గుతాయి. ఆయాసం రోగులకు దీనివలన చాలా తేలికగా ఉంటుందని ప్రత్యేకంగా శాస్త్రంలో చెప్పడం జరిగింది. దురదగొండి విత్తులు మూలికలు అమ్మే షాపుల్లో అంటే పచారీ షాపుల్లో దొరుకుతాయి ... ప్రయత్నించి చూడండి...........

  • Title :Chitikalo Chikitsa
  • Author :Dr G V Purna Chandru B A M S
  • Publisher :Dr G V Purna Chandru B A M S
  • ISBN :MANIMN3704
  • Binding :Paerback
  • Published Date :2022
  • Number Of Pages :304
  • Language :Telugu
  • Availability :instock