చిత్రకళ - నూతన ధోరణులు
(New Trends In Art)
ఏ రంగంలోనైనా మార్పు సహజం. ఏ మార్పు చెందని రంగం, జీవితం, జడ (నిర్జీవ ప్రపంచం సహా ఏదీ వుండదు. రుచుల్లో, అభిరుచుల్లో, ఫాషన్ రంగంలో నిరంతరం మార్పు చోటు చేసుకున్నట్లే చిత్రకళారంగంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త పోకడలు చోటు చేసుకుంటాయి. కళా వుద్యమాలు మారుతున్నట్లే, కళా ధోరణలు కూడా మార్పు చెందుతాయి. ఉద్యమాలు మారిపోవడానికి కారణం భావజాలం - క్లాసిసిజమ్, క్యూబిజం, నైరూప్య/ విరూప కళ, సర్రియలిజం మొదలైన వుద్యమాలు అలా పుట్టుకొచ్చినవే; ఐతే ఒక ఉద్యమస్థానంలో మరొక ఉద్యమం కుదురుకోవడానికి చాలా టైం పడ్తుంది. కళా వుద్యమాలు మారుతున్నట్లే కళాధోరణలూ చాలా తరచుగా మారుతుంటాయి.
కళాకారుని నూతన, అద్వితీయ సృష్టి చేయాలన్న తపనతో అపూర్వ కళా సృష్టి జరుగుతుంది. ప్రతి కళాకారుడూ తనవైన అభిరుచులూ, ఆదర్శాలు, సిద్ధాంతాలతో చేసిన కళాసృష్టి కళలో అనంతమైన వైవిధ్యానికి కారణమౌతుంది. ఏ శైలికి, ఏ నూతన పోకడలకు ఆదరణ వుంటుందో నిర్ణయించేది మాత్రం కళాకృతుల కళా ఖండాల కర్తలు, వినియోగదారులు, కళా సంరక్షులు (cura- tors), కళా పండితులు (connoisseurs). అందువల్ల వర్తమాన కళారంగం నిత్య నూతనత్వానికి నిలయమౌతుంది. ఈ నేపథ్యంలో కళాజగతిలో ఏమేమి మార్పులు జరుగుతున్నాయో పరిశీలిద్దాం.
గత రెండు మూడు దశాబ్దాలుగా కళా జగతిలో చోటు చేసుకున్న మార్పులు అనేకం. మరుగునపడిపోయిన అలంకార కళ (figurative art) మళ్ళీ ఊపిరి పోసుకోవడం, త్రీడి చలన కళ, వీధికళ, బహిరంగ ప్రదేశకళ, ప్రకృతికళకు ఆదరణ పెరగడం, ఆన్లైన్ మార్కెట్ విస్తృతి, ప్రదర్శిత కళలు వీక్షకుని చెంతకు చేరడం వర్తమాన కళకు ఆదరణ పెరగడం లాంటివి ప్రముఖంగా కనిపించే.....................