ముగ్గురు మిత్రులు
కోటేశ్వరరావు, విశ్వదక్ష ఆచార్య, రావణ దీక్షితులు ముగ్గురు చిరకాల స్నేహితులు మరియు పాఠశాలలో సహవిద్యార్థులు. కోటేశ్వరరావు బి.కాం. చదువుకున్నాడు. అతని తండ్రి వ్యాపారస్తుడు. విశ్వదక్ష ఆచార్య ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించాడు. వీరి తండ్రి అశిల్పి. రావణ దీక్షితులు బి.ఏ. చదువుకున్నాడు. వీరి తండ్రి పౌరోహితుడు. ఈ ముగ్గురు స్నేహితులు ఉద్యోగం కోసం పట్టణానికి వచ్చి ఒక అద్దె గదిలో ఉంటున్నారు. వారి ఆహారాన్ని వారే వండుకొని తినేవారు.
ఈ ముగ్గురు మిత్రులు ఒక రోజు పట్టణంలో జరుగుతున్న ఒక సంతకి సాయంకాలం 5 గంటలకు వెళ్ళారు. సంతలో అంతా తిరిగి అన్ని వస్తువులు, అన్ని వింతలు పరిశీలనగా చూసి 7 గంటలకు బయటకు వచ్చారు. రోజువారి ఆహార పదార్థాలకి కోటేశ్వరరావు సమకూర్చేవాడు. మిగతా ఇద్దరు వారి ఖర్చు పైకం నెలవారి ఇచ్చేవారు.
ఆ రోజు సంత నుంచి బయటికి వచ్చిన తర్వాత, జేబులోని పర్సు దొంగిలించబడినది అని కోటేశ్వరరావు గుర్తించాడు. ఆ విషయాన్ని తన మిత్రులకి చెప్పాడు. వారు తమ జేబు చూసుకుంటే డబ్బులు లేవు. విశ్వదక్ష ఆచార్య దగ్గర మాత్రం ఒక రూపాయి ఉంది. ఆ ఒక్క రూపాయితో ఆరు అరటిపండ్లు కొనుక్కొని వారి గదికి చేరుకున్నారు.
గదికి చేరుకునే సరికి సుమారుగా 7:30 గంటలు అయినది. గదికి వెళ్ళి ఇలా అనుకున్నారు. ఇప్పుడు అరటిపండ్లు తింటే అర్ధరాత్రి ఆకలి వేయవచ్చు. కొంచెం సమయం నిద్రించి 10 గంటల ప్రాంతంలో లేచి ఒక్కొక్క చెరో రెండు అరటిపండ్లు తిందాము అని అనుకున్నారు.................