• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Cholera lo Prema

Cholera lo Prema By P Mohan

₹ 250

1వ అధ్యాయం

అది అనివార్యం. బాదం కాయల వగరు వాసన అతనికెప్పుడూ విఫలప్రేమ దుర్గతిని గుర్తుకు తెస్తుంటుంది. డాక్టర్ జువెనల్ ఉర్బినో తెలవారుతున్నా ఇంకా మసగ్గానే ఉన్న ఆ గదిలోకి అడుగుపెట్టగానే ఆ వాసన పసిగట్టాడు. చాలా ఏళ్లుగా తీరుబడిగా ఉన్న అతడు అత్యవసర కేసుపై హడావుడిగా అక్కడికి వచ్చాడు. చదరంగంలో తన ఆత్మీయ ప్రత్యర్థి జెరేమియా డి సేంట్ అమూర్ పరిమళభరితమైన గోల్డ్ సైనేడ్ ధూపంతో తలపోతల నరకం నుంచి శాశ్వతంగా విముక్తి పొందాడు. పొరుగు ద్వీపదేశం నుంచి వచ్చిన ఆ శరణార్థి కుంటివాడు, మాజీ సైనికుడు. యుద్ధంలో కాళ్లు పోయాక చిన్నపిల్లల ఫొటోగ్రాఫర్గా మారాడు. తను నిద్రపోయే మడత మంచంపైనే దుప్పటి కప్పుకుని నిర్జీవంగా పడున్నాడు. మంచం పక్కనున్న బల్లమీద విషం ఆవిరైన పళ్లెం. నేలమీద మంచం కోడుకు కట్టేసిన నల్లని గ్రేట్ డేన్ జాతి కుక్క కళేబరం. దాని ఛాతీ మచ్చలేని తెలుపు. దాని పక్కనే యజమాని ఊతకర్రలు. ఆది పడగ్గదే కాదు, లేబొరేటరీ కూడా. ఓ కిటికీలోంచి ఉదయకాంతి సామాన్లతో కిక్కిరిసిన ఆ గదిలోకి మెల్లగా ప్రసరిస్తోంది. ఆ మసక వెలుతురులోనే చావుబలిమిని గమనించాడు డాక్టర్. మిగతా కిటికీలతోపాటు ప్రతి కంతను దుప్పట్లతోనో, అట్టముక్కలతోనో మూసేసిన ఆ వాతావరణం మరింత దుర్భరంగా మారింది. కరెంటు బుగ్గ కింద ఎర్రకాయితం పరిచిన బల్లమీద లేబుళ్లు లేని జాడీలు, సీసాలు, బీటలువారిన రెండు కంచు పళ్లేలు చిందరవందరగా ఉన్నాయి. జిగురు మండించడానికి వాడిన మరో పళ్లెం శవం పక్కనే. చుట్టుపక్కలంతా చెల్లాచెదరుగా పాత పుస్తకాలు, పత్రికలు, గాజు పలకలపై ఫొటో నెగిటివుల దొంతరలు, విరిగిన ఫర్నీచర్. అంతా అన్నీ దుమ్ములేకుండా శుభ్రంగా ఉన్నాయి. కిటికీలోంచి వీస్తున్న పిల్లగాలి ఆ వాతావరణాన్ని తేటపరిచినా, వగరు బాదం కాయల్లో చల్లారిపోతున్న అదృష్టహీన ప్రేమకణికలను కూడా గమనించవచ్చు. గౌరవంగా చనిపోవడానికది సరైన చోటు కాదనుకున్నాడు ఉర్బినో ఎప్పట్లాగే. అంత గందరగోళం దైవసంకల్పమేమో అనిపించింది అంతలోనే.

ఓ పోలీస్ ఇన్స్పెక్టర్, ప్రభుత్వ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ శిక్షణ పూర్తిచేసుకుంటున్న వైద్య విద్యార్థి అప్పటికే చేరుకుని కిటికీ తెరిచి, శవంపై దుప్పటి కప్పారు. డాక్టర్ రాగానే గంభీరంగా అభివాదం చేశారు. అందులో గౌరవానికంటే సానుభూతే ఎక్కువ. మృతుడు...............

  • Title :Cholera lo Prema
  • Author :P Mohan
  • Publisher :KaKi Prachuranalu
  • ISBN :MANIMN4671
  • Binding :Papar back
  • Published Date :Sep, 2023
  • Number Of Pages :262
  • Language :Telugu
  • Availability :instock