₹ 100
ఇలియాడ్, ఒడెస్సీ, ఎపిక్ సైకిల్, పారడైజ్ లాస్ట్, పారడైజ్ రిగెయిడ్, ఈనీడ్, డివైన్ కామెడీ, పిల్ గ్రిమ్స్ ప్రోగ్రెస్, మూడు గ్రీకు ట్రాజెడీలు, ఫాస్ట్, శిలప్పదికారం, మణిమేఖల, మస్నవి, లాంటి మహా కావ్యాల్ని ఇతర భాషలలోంచి తెలుగులోకి, సౌందర్యలహరి, భాగవతం, భగవద్గీతను ఇంగ్లీషులోకి అనువదించి సాహిత్యలోకానికి అందించిన సృజనలోకం ఇప్పుడు వైద్య గ్రంథాల్లోని అద్భుత విషయాలను కవిత్వంగా, కథలరూపంగా సమర్పిస్తోంది.
“ఒక సరస్సు-అనేక హంసలు” మానసిక వ్యాధుల్ని వివరించే తొలి దీర్ఘకావ్యం. మరణశాసనం-మృత్యువు గురించి నినదించే కవితారూపకం, 'కర్కాటకం' కాన్సరు చరిత్ర గురించి తెలిపే అరవై కవితల మణిహారం. 'ఛప్ కె ఛుప్' (రహస్యభాష-1) స్త్రీలలో వచ్చే వ్యాధుల్ని కథారూపకాలుగా వివరిస్తూ ప్రాక్పశ్చిమ కథాసీమల మూలాల్లోకి వెళ్తూ, వస్తూ పాఠకులను నూతన ఆలోచనా లోకాల్లో విహరింపచేస్తుంది.
రహస్యభాష-2 స్త్రీలలో వచ్చే ప్రముఖ క్యాన్సర్ల గురించి; రహస్యభాష - 3 స్త్రీలలో వచ్చే ఇతర వ్యాధుల గురించి వివరిస్తాయి.
అపంశయ్య నవీన్, కోవెల సుప్రసన్నాచార్య, పేర్వారం జగన్నాధం, రామా చంద్రమౌళి, జి. శ్రీనివాసరావు, లంకా శివరామప్రసాద్ వంటి రచయితల గ్రంథాల్ని దాదాపు వందకు పైగా ప్రచురించినది సృజనలోకం.
తెలుగు సాహితీ లోకానికి అందజేస్తున్న వైద్య గ్రంథాల వరుసలో ఆవిష్కరించబడున్న- రహస్యభాష-1 సాహితీ ప్రియుల మన్ననలనందు కుంటుందని సృజనలోకం గాఢంగా విశ్వసిస్తున్నది.
- డాక్టర్ లంకా శివరామప్రసాద్
- Title :Chup Ke Chup Ke. . . . (Rahasya Basha)
- Author :Dr Lanka Siva Rama Prasad
- Publisher :Dr.Lanka Siva Rama Prasad
- ISBN :MANIMN2622
- Binding :Paerback
- Published Date :2015
- Number Of Pages :80
- Language :Telugu
- Availability :instock