The Science, Mathamatics & Technic అంటే?
సినిమా అంటే టెక్నిక్స్ వుంటాయి. కాని ఈ సైన్స్, మ్యాథ్స్ ఏంటి? వీటి గురించి తెలుసుకుందాం.
సైన్సు : అసలు సినిమా అంటే వాస్తవంలా భ్రమింపజేసే అవాస్తవం. అంటే ఇందులో వాస్తవం వుంది. అవాస్తవము వుంది. ఇందులో వాస్తవాల్ని కళ్ళ ముంద ఆవిష్కరింపజేసేది సైన్సు. ఒక కథను స్క్రీన్ మీద ఆవిష్కరించేటప్పుడు వాస్తవానికి దగ్గరగా తీసుకెళ్ళేది, మన కళ్ళకు కనపడే కథ (Structru of the Story) సైన్సు. ప్రతి కథలోనూ సైన్సు వుంటుంది. తెలుగులో సైన్సు అంటే విజ్ఞానశాస్త్రము. కథను తయారుచేయడంలో చూపించే విజ్ఞతే. ఈ విజ్ఞానశాస్త్రము.
Mathamatics : సైన్సు సినిమాను వాస్తవానికి దగ్గరగా తీసుకెళితే ఈ Maths భ్రమను వాస్తవానికి దగ్గరయ్యేటట్టుగా చేస్తుంది. లెక్కలు అంటే అంకెలు. సంఖ్యలే కాదు, కథా కథనాల్లో కూడా కొన్ని లెక్కలు వుంటాయి. కూడికలు, తీసివేతల్లాగ కథలో ఏది వుంచాలి, ఏది తీసివేయ్యాలి, ఏది ఎలా చూపించాలి. అని ఓ మ్యాథమెటిక్ Calculationలో వుంటాయి.
ఉ: నువ్వు ఒక బిల్డింగ్ కట్టాలి అనుకున్నావు. దానికి కావలసిన సామాగ్రి అంత సమకూర్చుకున్నావు. నిజంగా ప్యాలెస్ కట్టాలి అనుకుంటే కొన్ని నెలలు, సం॥లు పడుతుంది. అది పెద్ద ప్రాసెస్. అంతా చూపిస్తే బోర్ కొడుతుంది. ఇలాంటి సందర్భంలోనే మ్యాథమెటిక్స్ ను వుపయోగించాలి. సామాగ్రి అంతా చూపించి ఒక షాట్ బిల్డింగ్ గా మారిపోయినట్టుగా చూపిస్తాం. ఇక్కడ బిల్డింగ్ కట్టడం చూపించలేదు. కాని బిల్డింగ్ కట్టినట్లు చూపిస్తున్నాం. భ్రమను వాస్తవం అని చూపిస్తున్నాం. దీన్ని మ్యాథమెటికల్ Calculation అంటాం. ఇది సీనిక్ ఆర్డర్ వేసేటప్పుడు బాగా వుపయోగపడుతుంది. అర్ధం అవడం కోసం ఉ॥ చెప్పడం జరిగింది. ఈ థియరీని అర్ధం చేసుకుని ఎక్కడ ఎలా అప్లై చేయ్యాలో అనేది నీ తెలివి తేటల మీద ఆధారపడి వుంటుంది.
టెక్నిక్స్ : సినిమాను రూపొందించడానికి కథ మొదలుకొని అన్ని విభాగాలలో సమన్వయపరచడంలో కొన్ని టెక్నిక్స్ వుంటాయి. ఆటెక్నిక్స్ ఎప్పుడు ఎలా వాడాలో..........