డా. పాలకోడేటి సత్యనారాయణరావు
ప్రపంచ సినిమా చరిత్రలో ఎన్నెన్నో మైలురాళ్లు. ఈనాడు మనం చూస్తున్న సినిమా ఒక్కరోజులో రూపు దిద్దుకున్నదీ కాదు, ఒక్క వ్యక్తివల్ల సాధ్యమయిందీ కాదు. నేటి మన సినిమా ఒకనాడు, వెలుగునీడలపట్ల మనిషి ఆసక్తితో ఆరంభం అయిందనీ, కేవలం కొన్ని ఫొటోలతో మొదలయిందనీ జ్ఞప్తికి తెచ్చుకుంటే, సినిమా పురోగతి అబ్బురం అనిపిస్తుంది. దేశవిదేశాలలో సినిమా పరిశ్రమ పురోగతిని పరిశీలించడం ఒక అద్భుతమయిన అనుభూతిని కలిగిస్తుంది. ఒక్కో అడుగుగా సినిమా పరిశ్రమ నడక - అనేక దిశలనుంచీ, బహుముఖంగా సాగింది. ఈ అడుగుజాడలను అనుసరిస్తూ ముందుకు సాగటం అనేకమందిలో ఆలోచనలనూ, గత వైభవ మధురస్మృతులనూ కలుగజేస్తాయి.
సినిమా వేసిన తొలి అడుగులనుంచీ, నేటివరకూ జరిగిన శాస్త్ర సాంకేతిక పురోగతినీ, ప్రపంచంలో విడుదల అయిన ఉత్తమ చిత్రాలనూ గుర్తు చేస్తూ, మనపై ఆ చిత్రాల ప్రభావాన్నీ వివరిస్తూ, కేవలం ఒక్క నిమిషం నిడివితో ఉండేలా - ఈటీవి సినిమా ఛానల్ కోసం రూపొందించిన కార్యక్రమం 'సినీ కథ'.
ప్రతీ దినం - ఆ క్యాలండర్ తేదీనాడు సినిమారంగంలో ఏం జరిగిందీ అనేది ... సినిమాప్రపంచవీక్షణంగా, ప్రధానంగా తెలుగు సినిమా చరిత్ర కేంద్రంగా, నాటి చరిత్రకు నేటి దర్పణంగా ఈటీవి ప్రేక్షకులముందుకు వచ్చిన కార్యక్రమం 'సినీ కథ'. ఈ కార్యక్రమం - 2017 డిసెంబర్ 1 నుంచి ధారావాహికంగా ప్రతిదినమూ ఈటీవి సినిమా ఛానల్లో ప్రసారం అవుతున్న విశిష్ట కార్యక్రమం ఇది. సినిమా చరిత్రను విభిన్నమైన దృష్టికోణంలో చూడదలిచేవారికి - ఇదొక వినూత్నమైన సమాచార విందుభోజనం. ఆరగించండి!!..............