• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Cross Examination Ela Cheyali

Cross Examination Ela Cheyali By B Chandra Kumar

₹ 250

భారత సాక్ష్యాధారాల చట్టం
 

INDIAN EVIDENCE ACT 1872

భారత సాక్ష్యాధారముల చట్టము 1872 పూర్తిగా శాస్త్రీయమైనది. మానవ అనుభవసారమే ఈ పుస్తకం. చట్టాల విషయంలో ఇంత శాస్త్రీయమైన పుస్తకం మరొకటి నాకు కనబడలేదు. మానవుల అనుభవాలను క్రోడీకరించి తార్కికంగా మొదట 1855లో రూల్స్ అఫ్ ఎవిడెన్స్ ఆక్ట్ 2 అఫ్ 1855 తయారుచేశారు. తరువాత భారత సాక్ష్యాధారాల చట్టం 1872 తయారు చేయబడినది. ఇంగ్లాండ్లో స్టెఫెన్ ఈ చట్టాన్ని రూపొందించారు. దాదాపు 150 సంవత్సరాలు గడిచినను సాక్ష్యాధారముల చట్టంలో మూలసూత్రాలను ఎవరూ మార్చలేదు.

"పదిమంది నేరస్తులు తప్పించుకున్నా ఒక్క నిరపరాధికి కూడ శిక్ష పడకూడదు" అనే సూత్రమే ఈ చట్టానికి ఆధారం.

Grave suspicion cannot take the place of proof. AIR 1971 SC 1898 AIR1975 SC 258 1997(2) ACT(A) 411

ఎంత తీవ్రమైన అనుమానం ఉన్నను, అనుమానం వాస్తవాన్ని నిరూపించడం కాజాలదు. కేవలం అనుమానం మీద ఎవ్వరికి శిక్ష

వేయకూడదు.

ముద్దాయిలపై కేసును నిర్ధారించాల్సింది ప్రాసిక్యూషన్ వారు (నేరారోపణ చేసినవారు). నేను నేరం చేయలేదని రుజువుచేయాల్సిన బాధ్యత ముద్దాయిపై లేదు. AIR 1957 SC 366.

కోర్టులో రుజువు చేయలేని విషయం జరుగలేదని భావించాల్సి

ఉంటుంది. AIR 1956 SC 1166.

ఎంతమంది సాక్షులున్నారనే దాని కంటే సాక్ష్యం ఎంతవరకు నమ్మ తగినది. ఎంతవరకు తర్కానికి నిలబడుతుంది అనేవి ముఖ్యం. సాధారణ................

  • Title :Cross Examination Ela Cheyali
  • Author :B Chandra Kumar
  • Publisher :JCK LAW ASSOCIATES
  • ISBN :MANIMN5270
  • Binding :Papar back
  • Published Date :July, 2023 2nd print
  • Number Of Pages :124
  • Language :Telugu
  • Availability :instock