ముందుమాట
నిజాల వెలికితీత ప్రయాణం
ఇది గొప్ప అద్భుతమనే చెప్పాలి.
ద డా విన్బీ కోడ్ అనే గ్రంథం ప్రపంచ వ్యాప్తంగా సాగించిన తన విస్తృత అమ్మకాల ప్రభంజనంతో సాధించి పెట్టిన విజయం ఆ గ్రంథకర్తను సహితం ఆశ్చర్యంతో ముంచెత్తింది. ద డా విన్బీ కోడ్ గ్రంథకర్త డాన్ బ్రౌన్ ఇంతకు మునుపే డిజిటల్ ఫోర్ట్రెస్ (అంకెల దుర్గం) ఏంజిల్స్ అండ్ డీమన్స్ (దేవదూతలు దయ్యాలు) మరియు డిసెప్టివ్ పాయింట్ (మాయల శిఖరం) అనే నవలలను రచించడంలో గొప్ప విజయాన్ని సాధించి ప్రసిద్ధి కెక్కాడు. అయినప్పటికిని ఒక విషయాన్ని ఒప్పుకొన్నాడు, "దాన్ని ఇంతమంది ప్రజలు ఇంతగా పట్టించు కొంటారని నేను ఎన్నడు ఊహించలేదు" అన్నాడు
2003 లో మొట్టమొదటి సారిగా డా విన్చీ కోడ్ విడుదల చేయబడి నప్పటి నుండి 3 కోట్ల 6 లక్షల ప్రతులు అమ్ముడు పోయాయి. 44 భాషల్లోనికి తర్జుమా చేయబడింది. ఇంకా ఈ గ్రంథం అమ్మకాలు మరియు అనువాదం లెక్కల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అందుకనే ఈ గ్రంథ రచన, విస్తరణ ప్రచారం కోసం ఏకంగా ఒక పరిశ్రమనే స్వయంగా స్థాపించి, తద్వారా సామాన్యమైన పాఠకులు సహితం సులభంగా ఈ సమాచారాన్ని ఆకలింపు చేసుకోడానికి వీలుగా ఆ గ్రంథ అంశానికి సంబంధించిన చిత్రలేఖనాలు దృష్టాంతరములతో (160 చిత్రాల్లో వివరణలు) మరియొక అనుబంధ వివరణాత్మక గ్రంథాన్ని కూడా సిద్దపరచి విడుదల చేశారు.
డావిన్సీ కోడ్ గ్రంథాన్ని ఎలా చదవాలి? ఒక అంశంపై నిజ నిర్ధారణకు............