సాహిత్యంలో స్వచ్ఛమైన కొత్త నీరు
డా॥ సంధ్య విప్లవ్ కథలు
సామాజిక తత్వవేత్త
బి.ఎస్. రాములు
బీసీ కమిషన్ తొలి ఛైర్మన్,
76: 8331966987
'దా... చౌ' కథల సంపుటి సాహిత్యంలో స్వచ్ఛమైన కొత్తనీరు. రచయిత్రి డా|| సంధ్య విప్లవ్ తొలి కథల సంపుటి ఇది. వరంగల్ ఖాజీపేట దర్గా సమీపంలో గ్రామీణ ప్రజలు ఎలా జీవిస్తూ వచ్చారో వందేళ్ళ పరిణామాలు ఈ కథల్లో కనపడుతుంది. మహిళలు రాసే కథల్లో చిత్రణ, వైవిధ్యం, స్త్రీ పాత్రలు, వారి పట్ల ఉండే అపార గౌరవం ఎలా ఉంటుందో ఈ కథల్లో చూడవచ్చు. వంట పట్ల మహిళలకు ప్రత్యేక నైపుణ్యం అలవడుతుంది. అందువల్ల 'దాల్... చ' కథలో 'దాల్... చ' ఎన్ని రకాలుగా చేస్తారో చక్కగా చిత్రించారు. కుల, మత భేదాలు మరిచి తెలంగాణ ప్రాంతంలో కలిసి జీవించిన సౌహార్ద్ర సంస్కృతి, జీవన వ్యవస్థ ఈ కథల్లో సాక్షాత్కరిస్తుంది. దృశ్యీకరణ ఈ కథల్లో ప్రత్యేకత. అందువల్ల కథలు ఒక డాక్యుమెంటరీలా, సినిమా సన్నివేశాల్లా సాగిపోతాయి.
డా॥ సంధ్య విప్లవ్ అనస్తీషియా డాక్టర్గా పని చేస్తున్నారు. వారి నాన్న లివింగ్స్టన్ ఆర్టీసి కండక్టర్గా వందలాది జీవితాలను నిత్యం చూసిన అనుభవశాలి. అమ్మ కె.బి. అరుణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అడిషినల్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. భర్త విప్లవ్ సినిమా పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. పిల్లలు ఓజ పదవ తరగతి చదువుతున్నది. కొడుకు పూర్వాన్స్డ్ ఏడవ తరగతి చదువుతున్నాడు. డా॥ సంధ్య అక్కయ్య జోత్స్న నర్సింగ్ కాలేజి ప్రిన్సిపల్గా సత్తుపల్లిలో పని చేస్తున్నారు. అన్నయ్య కె.బి. కిరణ్ వరంగల్ జిల్లాలో పిఇటి టీచర్గా పని చేస్తున్నారు. ఇలా డా॥ సంధ్య విప్లవ్ మధ్య తరగతిగా ఎదిగిన రెండవ తరానికి చెందిన ఉన్నత విద్యావంతురాలు. లంబాడ సామాజిక వర్గంలో ఎదిగివచ్చిన రచయిత్రి.
డా॥ సంధ్య విప్లవ్ అనస్తీషియా డాక్టర్. 24 గంటలూ అటు డాక్టర్లకూ, ఇటు పేషెంట్లకు అందుబాటులో ఉండాలి. కాలం వారి చేతిలో ఉండదు. ఎందరి జీవితాలనో పునరుజ్జీవింపజేసే క్రమంలో ఆమెదొక ప్రధానపాత్ర. నిరంతరం జాగరూకత. శ్రమ, పరిశ్రమ, శ్రద్ధ, పరిశీలన కలిగినవారే ప్రతిదీ ఆలోచిస్తారు. విశ్లేషిస్తారు. ఆమె జీవితాన్ని..............