• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Dalit Panthers Charitra

Dalit Panthers Charitra By J V Pawar

₹ 180

ముందుమాట

డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ మరణించిన తరువాత అంబేడ్కరిస్ట్ ఉద్యమంలో స్వర్ణ యుగం వంటిది ఏదైనా వుందంటే అది దళిత్ పాంథర్స్ ఉద్యమమే. ఈ మిలిటెంట్ సంస్థ 197 మే 29న ఏర్పడింది. ఐదు సంవత్సరాల అనంతరం 1977 మార్చి 7న సంస్థను రద్దు చేస్తున్నట్టు ముంబయిలో చేసిన ఒక పత్రికా ప్రకటనతో దళిత్ పాంథర్ అంతరించిపోయింది.

నాయకుల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విభేదాల కారణంగా రాజా ఢాలే జె.వి. పవార్ లను సంస్థనుంచి బహిష్కరిస్తున్నట్టు నామేవ్ ఢసాల్ 1974 సెప్టెంబర్ 30న ముంబయిలో ఒక ప్రకటన చేశారు. అది రాజుకుని 1974 అక్టోబర్ 23, 24 తేదీల్లో నాగపూర్లో జరిగిన దళిత్ పాంథర్స్ తొలి సదస్సులో నాన్దేవ్ ఢసాల్నే సంస్థ నుంచి బహిష్కరిస్తున్నట్టు తీర్మానం చేసే వరకు వెళ్లింది. ఆ తదనంతరం 1975 జూన్ లో ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా అత్యయిక పరిస్థితిని విధించారు. వార్తా పత్రికల మీదా, ప్రజా సంస్థల మీదా తీవ్రమైన ఆంక్షలు అమలయ్యాయి. అందువల్ల దళిత్ పాంథర్స్ ఉద్యమంలో 1972 మే 1975 జూన్ మధ్యకాలమే అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు.

ఈ కాలంలో దళిత్ పాంథర్ ఉద్యమం దేశంలో ఒక తుఫాన న్ను సృష్టించింది. సమకాలీన సామాజిక, రాజకీయ రంగాలను ఒక ఊపు ఊపింది. దళితులపై రోజు రోజుకూ పెరుగుతున్న అన్యాయాలను, అత్యాచారాలను దీటుగా ఎదుర్కొనే విధంగా అంబేడ్కర్ అనుచరులకు నూతనోత్తేజాన్ని అందించింది. నిబద్ద సైనికుల మాదిరిగా వీధుల్లోకి వచ్చిన యువతీ యువకులను వ్యవస్థను ఎదిరించగల వీరులుగా తీర్చిదిద్దింది. బాధితులకు చేయూతనిచ్చింది. దళిత్ పాంథర్ మనుగడ సాగించింది కొద్దికాలమే అయినా మొద్దు నిద్ర పోతున్న వ్యవస్థను తట్టిలేపి, అణగారిన వర్గాలపై దృష్టిని సారించేట్టు చేసింది. దళిత్ పాంథర్ లక్ష్యం కేవలం దళితులు ఆర్థికాభ్యున్నతి మాత్రమే కాదు వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులు సక్రమంగా అమలు జరిగేలా, సమాజంలో వారికి స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం దక్కేలా చేయడం కూడా.

దళిత్ పాంథర్స్ ఉద్యమం 1974 జనవరి 4 వరకూ ఎంతో ఉధృతంగా సాగింది. ఆ తరువాత 1974 జనవరి 5న ముంబయిలో ముఖ్యంగా వోర్లీ, నయీగావ్ ప్రాంతాల్లో ఉద్యమంపై ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఆ దాడిలో దళిత్.............

  • Title :Dalit Panthers Charitra
  • Author :J V Pawar
  • Publisher :Hydrabad Book Trust
  • ISBN :MANIMN3800
  • Binding :Papar back
  • Published Date :Feb, 2020
  • Number Of Pages :252
  • Language :Telugu
  • Availability :instock