₹ 100
ప్రపంచంలో యే దేశంలోనూ లేని కులవ్యవస్థ ఒక్క భారత దేశంలో వేల సంవత్సరాల నుండి ఒక స్థిరమైన వ్యవస్థీకృతంగా మారింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ఈ నాలుగు వర్ణాలను నేనే సృష్టించానని చెప్పించారు శ్రీకృష్ణుడిచేత. ఈ నాల్గు వర్ణాలకు చెందనివాళ్ళను పంచములని, అస్పృశ్యులని, నిమ్మకులాలవారని పేర్లు పెట్టి వాళ్ళను హైందవ సమాజం నుండి వెలివేశారు. వారిని ఉరి వెలుపలనే ఉంచారు. నీచమైనవని భావించే పనులు చేయించారు. వాళ్ళు చదువుకోకుండా, విజ్ఞాన పంతులు కాకుండా చేసారు. అగ్రవర్ణాలవారి చెప్పుచేతల్లోనే పెట్టుకుని వాళ్ళను బానిసలకంటే హీనంగా చూశారు. ఈ 21 వ శతాబ్దంలో కూడా దళితుల పట్ల అక్కడక్కడ పూర్వాంలాగే అంటరానితనం, విపక్ష, అవమానం, హింస కొనసాగుతూనే ఉన్నాయి. ఈ " దళిత బ్రాహ్మణుడు " అనే కధ సంకలనంలోని కథలన్నింటి లోనూ దళితుల పట్ల జరుగుతున్న ఈ తీవ్రమైన అన్యాయాలే చిత్రితమయ్యాయి.
-రంగనాధ రామచంద్రరావు.