• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Damaakaanda

Damaakaanda By Dr Baddipudi Jaya Rao

₹ 300

"రుధిర క్షేత్రంపై ఎగరేసిన నీలిజెండా”

మహాకవి

డా॥ కత్తి పద్మారావు

డా॥ బద్దిపూడి జయరావు ఒక సామాజిక, సాంస్కృతిక, తాత్విక విద్యాసంపన్నుడు. మనసున్న మనిషి. ఆయన ఊరు ప్రకాశం జిల్లా నూకవరం.

2015 ఏప్రిల్ 14 న శాఖవరం గ్రామంలో డా॥ బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి వెళ్ళినపుడు నాకు, నాతోపాటు వచ్చిన వాళ్ళందరికి నూకవరంలో జయరావు వాళ్ళ ఇంట్లో మంచి ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యంలో ఎంతోప్రేమ, ఎంతో ఆత్మీయత, ఎంతో దళిత సంస్కృతిని చూశాను. వాళ్ళ అమ్మానాన్న, అన్నావదినలు మంచి ఆదర్శమూర్తులు. దళిత సంస్కృతిని, మనం ఈ ప్రాంతంలో ఎక్కువగా చూడగలం.

కారంచేడు ఉద్యమం ప్రకాశం జిల్లాకి ఉద్యమదీప్తిని కలిగించింది. ప్రకాశం జిల్లాలో ప్రతిఒక్కరు ప్రేమమూర్తులు. వారి కళ్ళల్లో ప్రేమమందిరాలుంటాయి. ప్రకాశం జిల్లా దళితులు శ్రమజీవులు, నీతిమంతులు. తమ బిడ్డల విద్యకోసం ఆరుగాలం శ్రమను ధారబోసి విద్యాశిల్పాలు చెక్కిన మహోన్నతులు. ఆశిల్పాలలో ఒక మహోజ్వల శిల్పమే జయరావు. వాళ్ళమ్మ కోటమ్మ నిజాయితీగల దళితమాత. తన బిడ్డని మహా 'పండితుడ్ని చేయడమేకాక, గొప్ప పరిశోధకుడుగా చేసింది. తల్లి దండ్రులు ఇరువురు నిజాయితీకి పెట్టని కోటలు. వారి శ్రమశక్తితో ఎదిగినవాడు జయరావు.

ఆయన పుస్తకమంతా దళిత శ్రమజీవుల చెమట చుక్కల ధారల్లో ముంచి లేపిన సువాసన వస్తుంది. ఆయనది నిశితదృష్టి. ఆయన ఆత్మీయసముద్రుడు. ఆయన అక్షరాలలో ప్రతిఘటనా ప్రజ్వలనాలు మండుతూ ఉంటాయి. సంఘటనలు దృశ్యమానమై మనల్ని ఉత్తేజ పరుస్తుంటాయి. ఆయన పరిశోధనలో పోరాట వీరుడుగా మారతాడు. ఆయన “పోరాటం గురించి రాస్తున్నాడో! ఆయనే పోరాటం చేస్తున్నాడో. మనకు అర్ధం కాదు". అంత ఉన్మీలనమయ్యే గుణసముద్రుడు. ఆయన ప్రేమతో ఈ పుస్తకం రాశాడు. కేవలం పరిశోధకుడుగా కాదు...............

  • Title :Damaakaanda
  • Author :Dr Baddipudi Jaya Rao
  • Publisher :Sri Gurudeva Kalapeetam Prachuranalu
  • ISBN :MANIMN4942
  • Binding :Hard Binding
  • Published Date :2022
  • Number Of Pages :313
  • Language :Telugu
  • Availability :instock