• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

DandaKadiyam

DandaKadiyam By Tagulla Gopal

₹ 200

కలకొండ మట్టినుంచి...

ఒక చేత పుస్తకాలు, మరోచేత కట్టెపట్టుకొని పొద్దున, పొద్దుకి పసుల కాసిన ఈ చేతులే అక్షరాన్ని దిద్దినవి. అమ్మనాయినకు భారం కాకూడదని మల్కాజిగిరి కర్రీస్ పాయింట్లో కూరలు కట్టిన ఈ చేతులే కవిత్వం అల్లినవి. అమ్మతోపాటు మెద మోసిన రోజులు, ఎండకాలం సెలవుల్లో కంకర మోయడానికిపోయిన రోజులు, ఆదివారమొస్తే పతితీయడానికి పోయిన రోజులు ఇప్పటికి, ఎప్పటికి నాకు ఎంతో అపురూపం. ఇవన్నీ కవిత్వమే నాకు.

మా నాయిన దర్వాజ ఎత్తు మనిషి, నాయిన జీవితమంతా గొర్లను కాసిండు. సొంతంగా గొర్లు, మేకలు లేకపోవడంతోటి వేరే వాళ్ళ దగ్గర జీతానికి కుదిరిండు. కొన్ని దినాలకు సొంతంగా మేకలు సంపాదించినా అక్క పెండ్లికి వాటిని అమ్మిండు. అక్క పెండ్లికి అప్పుకావడంతో పట్నానికి వలసబోయిండు. చాపల కంపెనీల ఏ అర్ధరాత్రి వరకో కష్టపడేటోడు. ఇంట్లో గొడవల వల్ల హంసక్కగ్యాసునూనె వేసుకొని మాకు దూరమైంది. అప్పటినుంచి నాయిన మామూలు మనిషి కాలేకపోయిండు. తిరిగి ఊరికి వచ్చిండు నాయిన. అప్పటికే ఊరిలో వున్న ఇల్లు కూలిపోయింది. పుష్పమ్మ, శేఖర్రెడ్డి సార్ వాళ్ళు ఇల్లుకట్టుకోవడానికి సొంత జాగనిచ్చి నీడగ నిలవడ్డారు. ఊరిలో దొరికిన పనల్లజేసి ఇంటిని నడిపిండు నాయిన. సపారాలు ఎయ్యడం, బునాదులు తీయడం, పచ్చికట్టెలు కొట్టి అమ్మడం ఇట్లా ఎన్నో పనులు చేసి మమ్మల్ని చదివించిండు. నాయన ఎప్పుడు బయటికెళ్ళినా భుజం మీద గొడ్డలి ఉండేది. అదే మాకు నాల్గు మెతుకుల్ని పెట్టింది. అమ్మ వరినాట్లెయ్యడానికి, కలుపుతీయడానికి, వరి కోతలకు పోయేది. ఏ కాలంల ఏ పని దొరికితే అవన్ని చేసి పొయ్యి ముట్టిచ్చేది. గోడలు పూయడం, సున్నాలేయడం ఎక్కువ చేసేది....................

  • Title :DandaKadiyam
  • Author :Tagulla Gopal
  • Publisher :Kavi Sangamam Books Prachurana
  • ISBN :MANIMN6429
  • Binding :Papar Back
  • Published Date :Jan, 2022
  • Number Of Pages :164
  • Language :Telugu
  • Availability :instock