• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Danyam Ee Kallu! ! !

Danyam Ee Kallu! ! ! By S Shesharatnam

₹ 200

పురో వాక్కు

గౌరవనీయులు నరేంద్రమోడీగారి 'ధన్యం ఈ కళ్ళు' కవితా సంపుటిని తెలుగులో అనువాదం చేస్తారా అని శ్రీమతి అంజనా సంధీర్ గారు అడిగినపుడు వెంటనే స్వీకరించాను. గుజరాతీ నుండి హిందీలోనికి అంజనా సంధీర్గారు అనువదించారు. హిందీనుండి తెలుగులోనికి అనువదించే భాగ్యం నాకు కలిగింది.

ప్రస్తుత సంపుటిలోని కవితలు నరేంద్రమోడీగారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. వ్యక్తి, వ్యక్తిత్వంలో ఎన్నో పార్శ్వాలు. ఒక వైపు మోడీగారి క్రియాశీల రాజకీయ జీవితం. రెండవవైపు స్పందించే సున్నిత హృదయం, సృజనాత్మకత, క్షమత, జాతీయభావం, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాలనే తపన, వారి ఆదర్శ వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆధ్యాత్మికత, ప్రకృతి ప్రేమ, జీవన గమ్యం, యధార్థత, నదులపట్ల భక్తిభావం, తాత్వికత వారి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

భావ ప్రాధాన్యతను సంతరించుకున్న మోడీగారి ఈ కవితా సంపుటిలోని కవితలు పాఠకుల్ని ఆలోచింపజేస్తాయి. దేశం పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని ప్రేరేపిస్తాయి. జీవితంలోని ఆటుపోటులను తెలియజేస్తాయి. కవి హృదయమున్న సాహితీవేత్త మోడీగారు.

అందుచేతనే ఈ కవితా సంకలనంలోని కొన్ని కవితలు జీవిత యదార్థాన్ని ఆవిష్కరిస్తాయి, లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి. ప్రకృతిని ఆరాధించమంటాయి, సంస్కృతిని సంరక్షించమంటాయి, ఆదర్శ జీవన గమనానికి బాటలు వేస్తాయి. తాత్వికతను ఉద్బోధిస్తాయి. కళలను పోషించమంటాయి. ఆటపాటల ఆవశ్యకతను తెలియజేస్తాయి. సమర్పభావంతో దేశం కొరకు జీవితాన్ని అర్పించమంటాయి. హింసను.......................

  • Title :Danyam Ee Kallu! ! !
  • Author :S Shesharatnam
  • Publisher :Samata Publishers
  • ISBN :MANIMN6309
  • Binding :Papar Back
  • Published Date :2023
  • Number Of Pages :109
  • Language :Telugu
  • Availability :instock